Newsయూఎస్‌లో మ‌రో మైల్‌స్టోన్ దాటేసిన ' భ‌గ‌వంత్ కేస‌రి ' ......

యూఎస్‌లో మ‌రో మైల్‌స్టోన్ దాటేసిన ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ … జై బాల‌య్య అనాల్సిందే..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది గ్రౌండ్ లెవెల్ లో నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు కూతురు వరుసయ్య పాత్రలో యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల నటించారు. బాలయ్యకు జోడిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించ‌గా ఈ సినిమా ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో భగవంత్ కేస‌రి సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు.. అటు ప్రపంచ వ్యాప్తంగా కలుపుకొని రు. 32 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి. ఇవి డీసెంట్ నెంబర్లు అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 700 కె పైగా డాలర్లను సొంతం చేసుకున్న‌ ఈ సినిమా త్వరలోనే వన్ మిలియన్ దిశగా పరుగులు తీస్తోంది.

బాలయ్య నటించిన అఖండ – వీరసింహారెడ్డి రెండు సినిమాలు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేశాయి. ఇప్పుడు భగవంత్‌ కేసరి కూడా ఆ రికార్డును అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఓవర్సీస్ లో సినిమాలు చూస్తున్న జనాలు థియేటర్లలో జై బాలయ్య నినాదాలతో గోల గోల చేస్తున్నారు. ఇటు నిర్మాతలు కూడా తమ సినిమాను సక్సెస్ చేసినందుకు ఓవర్సీస్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news