Newsప‌వ‌న్ క‌ళ్యాణ్ - బోయ‌పాటి కాంబినేష‌న్‌... నిర్మాత ఎవ‌రంటే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్‌… నిర్మాత ఎవ‌రంటే..!

నిజంగానే ఈ కాంబినేషన్ వినటానికి చాలా కొత్తగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లతో అలరించే దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ? ఉంటుంది అన్నది ఊహకే అందటం లేదు. పవన్ కళ్యాణ్ ది డిఫరెంట్ స్టైల్.. అటు బోయపాటిది యాక్షన్ స్టైల్. బోయపాటి యాక్షన్ పవన్ కళ్యాణ్ కు సూట్ అవుతుందా ? అన్నది సందేహం.

పవన్ కళ్యాణ్ గొడ్డలి, కత్తులు పట్టుకుని నరుక్కుంటూ తెరమీద రక్తపాతం క్రియేట్ చేస్తే పవన్ అభిమానులే కాదు.. సగటు సినీ అభిమానులు ఆ సినిమాను చూస్తారా ? అన్న సందేహం సహజంగానే ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. తాజాగా బోయపాటి శ్రీను పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల రామ్ హీరోగా స్కంద సినిమాను తెరకెక్కించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయింది.

ఇక పవన్ కళ్యాణ్ గురించి బోయపాటి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్టర్ లేని వాడు.. ఏది అనుకుంటే అది చేస్తాడు.. ఎక్కడ మంచి ఉంటే ? అక్కడే నిలబడతాడు.. ఎక్కడ నిజాయితీ ఉంటే ? అక్కడ ఉంటాడు.. న్యాయం ఉన్నచోట అడ్డసుడిగా నిలబడతాడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం బోయపాటి పవన్ పై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్లాన్ తోనే బోయపాటి ఈ కామెంట్లు చేశారని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.

అయితే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ దగ్గర బోయపాటి సరైనోడు సినిమా తర్వాత అడ్వాన్స్ తీసుకున్నారు. ఆయనకు ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇటు అల్లు అరవింద్ కూడా జల్సా సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బోయపాటి దగ్గర ఉన్న అడ్వాన్స్ తో అరవింద్ బోయపాటి – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సెట్ చేస్తారా ? లేదా బోయపాటి – బన్నీ కాంబినేషన్ సెట్ చేస్తారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news