News' భ‌గ‌వంత్ కేస‌రి ' 2 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు......

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ 2 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు… ఫ‌స్ట్ వీక్ కుమ్ముడే కుమ్ముడు…!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్గా.. శ్రీలీల కీలక పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తర్కెక్కించుకున్న తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్.. యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్‌ కేసరి. ఈ యాడాది సంక్రాంతి వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య దసరాకు భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాకు తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. బాలయ్య కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా తొలి రోజు ఈ సినిమాకు రు. 32 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు వచ్చాయి. ఇక రెండో రోజు భగవంత్ కేసరి సినిమాకు రు. 19 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండో రోజులకు గాను భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా రు. 51.12 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఇక మూడో రోజు వసూళ్లు కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు ఈనెల 25వ తేదీ వరకు దసరా సెలవులు ఉండటంతో భగవంత్‌ కేసరి బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే పెర్ఫార్మ్ చేయనుంది. యూఎస్ లో కూడా ఈ సినిమా ఇప్పటికే 800 కే డాలర్ల మార్కెట్ టచ్ చేసి వన్ మిలియన్ డాలర్ల వైపు దూసుకుపోతుంది. ఏదేమైనా ఫ‌స్ట్ వీక్ ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కుమ్ముకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news