Newsఆ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ ర‌వితేజ‌పై విక్ట‌రీ కొట్టిన బాల‌య్య‌..!

ఆ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ ర‌వితేజ‌పై విక్ట‌రీ కొట్టిన బాల‌య్య‌..!

టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజ, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయ్ అంటూ రకరకాల పుకార్లు, షికారులు చేసేవి. ఇవి చాలా సంవత్సరాల పాటు నడిచాయి . అయితే బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ కి రవితేజ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా మనిద్దరి మధ్య ఎవరో గొడవ జరుగుతుందని పుకార్లు సృష్టించారు అని బాలయ్య రవితేజను ఓపెన్ గానే అడిగారు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. అవన్నీ పుకార్లే అని క్లారిటీ వచ్చేసింది . వీరిద్దరి మధ్య 15 ఏళ్ల క్రిందట హీరోయిన్ మీరాజాస్మిన్ విషయంలో గొడవ జరిగిందంటూ అప్పట్లో ఒక పుకారు అయితే ఉంది.

అప్పట్లో రవితేజకు బాలయ్య వార్నింగ్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు కనిపించాయి. అయితే ఇవన్నీ అబద్ధాలు అంటూ వారు క్లారిటీ ఇచ్చేశారు. అయితే బాలయ్య , రవితేజ గతంలో ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే రెండు మూడు సార్లు రవితేజ పై చేయి సాధించారు. 2008 సంక్రాంతికి బాలయ్య ఒక్కమగాడు , రవితేజ కృష్ణ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్కమగాడు డిజాస్టర్ కాగా.. కృష్ణ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత బాలయ్య మిత్రుడు, రవితేజ కిక్ సినిమాలు రిలీజ్ కాగా కిక్ సూపర్ హిట్ అయింది. మరోసారి 2011 సంక్రాంతి కానుకగా రవితేజ మిరపకాయ్, బాలయ్య పరమవీరచక్ర సినిమాలు రిలీజ్ కాగా పరమవీరచక్ర డిజాస్టర్ గా , మిరపకాయ సూపర్ హిట్ అయింది. అలా రవితేజ, బాలయ్య ఒకేసారి తమ సినిమాలతో పోటీ పడితే మూడు సందర్భాల్లోనూ రవితేజ పై చేయి అయింది.

అయితే ఈసారి దసరా కానుకగా బాలయ్య భగవంత్ కేసరి , రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. రెండు సినిమాలకు ఎబో యావరేజ్ టాక్ వచ్చింది. అయితే వసూళ్ల పరంగా చూస్తే బాలయ్య సినిమా కాస్త పై చేయి సాధించేలా కనిపిస్తోంది. బాలయ్య సినిమా యూత్ కు, యాక్షన్ ప్రియులకు, మహిళా సెంటిమెంట్ నేపథ్యంలో ఫ్యామిలీ లకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈసారి ఈ ఇద్దరి మధ్య పోరులో బాలయ్య సినిమా కాస్త పై చేయి సాధించేలా ఉంది. రవితేజతో పోటీ పడితే బాలయ్య సినిమా హిట్ అవ్వదు అన్న బ్యాడ్ సెంటిమెంట్ బాలయ్య ఎట్టకేలకు భగవంత్ కేసరి సినిమాతో బ్రేక్ చేసి పడేసాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news