Moviesఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మూడు గుడ్‌న్యూస్‌లు… వీళ్ల‌ను ఎవ్వ‌డూ ఆప‌లేడు ఇక‌..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మూడు గుడ్‌న్యూస్‌లు… వీళ్ల‌ను ఎవ్వ‌డూ ఆప‌లేడు ఇక‌..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

ఈ సినిమా వచ్చి ఏడాది దాటుతున్న ఇంకా ఎన్టీఆర్ నటించిన సినిమా రిలీజ్ కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరాశ‌తో ఉన్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీరిపోనుంది. ఏడాది వ్యవధిలో ఏకంగా మూడు సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ కానుంది. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటాయి.

కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనున్న ఈ సినిమాను యాష్‌రాజ్ ఫిలిమ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్లో పట్టాలు ఎక్కిస్తున్నారు. 2005 రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2005 జ‌న‌వ‌రి 26న వార్ 2 రిలీజ్ కానుండగా అదే ఏడాది ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కూడా రిలీజ్ కానుంది.

ఇలా ఏడాది వ్యవధిలోనే ఎన్టీఆర్ వరుస పెట్టి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక వరుస అప్డేట్లతో ఎన్టీఆర్ అభిమానులను మనం అస్సలు ఆపలేము.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news