Moviesఅభిమానుల గుండెలు బద్దలయ్యే న్యూస్.. రెండో పెళ్లి చేసుకోబోతున్న సింగర్ శ్రావణ...

అభిమానుల గుండెలు బద్దలయ్యే న్యూస్.. రెండో పెళ్లి చేసుకోబోతున్న సింగర్ శ్రావణ భార్గవి..? ఫోటోస్ వైరల్..!!

గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ సింగర్ శ్రావణ భార్గవికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఎవరైతే స్టార్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదో.. వాళ్లపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరీ ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం ఊపందుకుంది.

టాలీవుడ్ స్టార్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రావణ భార్గవి సింగర్ హేమచంద్ర ప్రేమించుకున్నారు . 2013 వీళ్ల పెళ్ళి జరిగింది. వీళ్లకి శిఖర అనే ఓ పాప కూడా ఉంది . కాగా చాలా అన్యోన్యంగా సాగిపోతున్న సంసారంలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయని .. ఆ కారణంగానే వీళ్ళు దూరం దూరంగా ఉంటున్నారు అని విడాకులు కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . అయితే ఈ వార్తలు కొట్టి పడేశారు వారిద్దరు. కానీ ఎక్కడ కూడా వీళ్లకు సంబంధించిన ఫోటోలు కానీ ఏ ఫంక్షన్ కి కూడా వీళ్ళు అటెండ్ అయినా దాఖలాలు కానీ లేకపోవడంతో నిజంగా విడాకులు తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఈ వార్తలను ట్రెండ్ చేస్తున్నారు .

మరికొందరు ఏకంగా శ్రావణ భార్గవి తన బ్రదర్ పెళ్లిలో దిగిన కొన్ని ఫొటోస్ ను మ్యాచ్ చేస్తూ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న ధంబ్ నైల్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు . దీంతో శ్రావణ భార్గవి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు . ఇది నిజంగా నిజమేనా..? అంటూ ఆరా తీశారు . అయితే శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోవడం లేదని .. ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టిన పుకారే అని క్లారిటీ వచ్చేసింది. దీంతో శ్రవణ భార్గవి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news