Newsకొత్త లుక్‌లో చంపేస్తోన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ... ఏం ఉన్నాడ్రా బాబు...!

కొత్త లుక్‌లో చంపేస్తోన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ … ఏం ఉన్నాడ్రా బాబు…!

త్రిబుల్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్ కు వెళ్లిపోయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే త్రిబుల్ ఆర్ మూవీ అమెరికా, జపాన్లోనూ దుమ్ము రేపుతోంది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు లభించడంతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వెళ్లిపోయింది.

ఇటీవల ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు. కొరటాల శివతో చేస్తున్న దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న వార్ 2 సినిమాలోను నటించమన్నాడు. ఇక సైమ అవార్డులకు వెళ్లిన ఎన్టీఆర్ ఆ అవార్డు అందుకేనే రోజు సూట్ అవుట్ ఫిట్ ఫోటోలను ఆయన వాట్సాప్ ఛానల్ లో షేర్ చేశాడు.

సూట్ వేసుకున్న తారక్ చాలా హ్యాండ్సం క్లాసిక్ లుక్‌లో అమ్మాయిల మనసు దోచుకునేలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మేకోవర్లో ఫార్మల్ సూట్ గడ్డంతో కెమెరాలకు అదిరిపోయే పోజులు ఇచ్చాడు. తారక్ ఇంత కొత్తగా కనిపించడానికి కార‌ణం ఆలీమ్ హాకీయే అని చెప్పాలి. ఇక దేవర సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవడంతో మరోసారి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సముద్రం నేపథ్యంలో తెరకెక్కి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news