Moviesఆ నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్ మనసును డీప్ గా హర్ట్ చేసిన...

ఆ నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్ మనసును డీప్ గా హర్ట్ చేసిన రామ్ చరణ్.. తప్పు చేశావ్ బ్రో..!

స్టార్ హీరోలు ఏ డెసిషన్ తీసుకున్న సరే వాళ్ళ అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి . అయితే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా అదే లిస్టులోకి వచ్చాడు రామ్ చరణ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్..ఇప్పుడు గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు రామ్ చరణ్ తో హాలీవుడ్ డైరెక్టర్లు కూడా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

అయితే తాజాగా రాంచరణ్ తీసుకున్న డెసిషన్ అభిమానులకి అస్సలు నచ్చడం లేదు . అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ మండిపడుతున్నారు . మనకు తెలిసిందే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాలి . రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే బయట పెరిగిపోతున్న టెంపరేచర్ ..ఎండ తీవ్రతకు తట్టుకోలేక చాలామంది హీరోస్ తమ షూటింగ్ షెడ్యూల్స్ ను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు .

తాజాగా రామ్ చరణ్ సైతం అదే నిర్ణయం తీసుకున్నారట . అంతేకాదు రామ్ చరణ్ ఒకటి – రెండు నెలలు కాదు ఏకంగా మూడు నెలల పాటు ఈ సినిమా పోస్ట్ పోన్ చేశారట. దీంతో ఫాన్స్ డీప్ గా హర్ట్ అవుతున్నారు . ఒక నెల పోస్ట్ పోన్ చేస్తే జూన్ నుంచి క్లైమేట్ చల్లబడుతుంది .. ఆ తర్వాత సినిమా షూట్స్ చేసుకోవచ్చు కదా..? మూడు నెలలు వాయిదా వేసి.. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసి.. ఎప్పుడు కంప్లీట్ చేసి ..ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. మళ్లీ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కి కూడా వెళ్ళిపోతావ్..తప్పు చేశావ్ చరణ్ అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news