Movies"లైఫ్ లోనే మొదటిసారి ఇలా"..బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లగానే అలాంటి పని చేస్తున్న...

“లైఫ్ లోనే మొదటిసారి ఇలా”..బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లగానే అలాంటి పని చేస్తున్న తారక్..!

అందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ బాగా చేస్తాడు . ఎటువంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసేయగలడు . అది ఎంత కష్టమైన స్టెప్స్ అయినా సరే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లా డాన్స్ చేసే హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . యమదొంగ సినిమాలో నాచోరే నాచోరే పాట స్టెప్స్ ఎంత కష్టంగా ఉంటాయో తెలుసు. అవి సింగిల్ టేక్ లోనే ఎన్టీఆర్ ఓకే చేశాడు అంటే ఆయనకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

కాగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అయితే కెరియర్ లో ఎప్పుడూ చేయని పని ఎన్టీఆర్ వార్ 2 కోసం చేస్తున్నాడు అనే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే . ఈ సినిమాలో అద్దిరిపోయే సాంగ్ డిజైన్ చేశారట మేకర్స్ .

వార్ వన్ సినిమాలో టైగర్ ష్రాఫ్.. హృతిక్ రోషన్ మధ్య ఓ సాంగ్ ఎంత హైలైట్ గా మారిందో మనకి బాగా తెలుసు . ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేసింది . ఇప్పుడు దానికి మించిపోయే రేంజ్ లో వార్ 2 సినిమాలో ఈ సాంగ్ ఉండబోతుందట . ఈ సాంగ్లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేయబోతున్నారట . దీనికోసం ముగ్గురు కొరియోగ్రాఫర్లు స్టెప్స్ క్రియేట్ చేశారట .అంతేకాదు ఈ సినిమాలో పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు తారక్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news