Moviesఏడ్చుకుంటూ షూటింగ్ నుండి వెళ్లిపోయిన సాయి పల్లవి.. అనకూడని మాట అనేసిన...

ఏడ్చుకుంటూ షూటింగ్ నుండి వెళ్లిపోయిన సాయి పల్లవి.. అనకూడని మాట అనేసిన తెలుగు హీరో..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని .. సినిమా ఇండస్ట్రీలో ఎంత జోవియల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనతో వర్క్ చేసే హీరోయిన్స్ అందరితోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఆ హీరోయిన్స్ కూడా ఆయనతో అలాగే మింగిల్ అవుతూ ఉంటారు. కాగా నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ద హిట్ సినిమాగా నిలిచిన ఎం సి ఏ సినిమాలో హీరోయిన్ గా నటించింది సాయి పల్లవి .

ఈ సినిమాను వేణు శ్రీరామ్ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశారు. 2017 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది . దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ సినిమాలో భూమిక ..నాని వదినగా నటించడం సినిమాకి మరింత ప్లస్ గా మారింది. విజయ్ వర్మ విలన్ రోల్ లో నటించగా.. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ మరో లెవల్లో నిల్చోపెట్టిందని చెప్పాలి.

అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో సాయి పల్లవిని సరదాగా నాని ఏడిపించాడని .. అప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య అసలు పరిచయమే లేదని ..కానీ ఆయన అలా ఏడిపించడంతో హర్ట్ అయి సాయి పల్లవి షూటింగ్స్ నుంచి వెళ్లిపోయింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ మ్యాటర్లోకి ఇన్ వాల్వ్ అయి..నాని ఒరిజినల్ బిహేవియర్ ఏంటో చెప్పి ఆయన చేత సాయి పల్లవి సారీ చెప్పించారట. అంతేకాదు ఆ తర్వాత సాయి పల్లవి – నాని బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు . తర్వాత వాళ్ల కాంబోలో వచ్చిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ప్రజెంట్ సాయి పల్ల్వి నాగ చైతన్య తో చందు మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news