News30 ఏళ్ల త‌ర్వాత భ‌గ‌వంత్ కేస‌రితో ఆ రికార్డ్ కొట్ట‌బోతోన్న న‌ట‌సింహం......

30 ఏళ్ల త‌ర్వాత భ‌గ‌వంత్ కేస‌రితో ఆ రికార్డ్ కొట్ట‌బోతోన్న న‌ట‌సింహం… ఆ రేర్ రికార్డ్ ఇదే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటు వరుస‌పెట్టి సినిమాలు చేస్తూ.. అటు రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఎనిమిది నెలల గ్యాప్ లో ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్టు.. బాలయ్య రాజకీయాల్లో కాస్త బిజీగా ఉండడంతో భగవంత్‌ కేసరి వాయిదా పడుతుందా ? అన్న సందేహాలు ఉన్నాయి.

అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఖతర్నాక్ వీడియో రిలీజ్ చేసి భగవంత్‌ కేసరి ముందుగా చెప్పిన టైంకే దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు.. మీరు రచ్చకు సిద్ధంగా ఉండి అంటూ సంకేతాలు ఇచ్చేశారు. ఇక నందమూరి అభిమానులు ఆగుతారా.. బాలయ్య కేరీర్‌ ప్రస్తుతం ఆల్ టైం హై లో ఉంది.. 40 ఏళ్లలో ఆయన చూడని రికార్డులు నాలుగేళ్లలో చూస్తున్నారు.. ముఖ్యంగా అఖండ, అన్‌స్టాప‌బుల్ తర్వాత బాలయ్య జాత‌క‌మే మారిపోయింది. బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది.

బాలయ్య సినిమాలు మంచినీళ్లు తాగినట్టుగా రు. 100 కోట్ల మార్కు అందుకుంటున్నాయి. దీనికి తోడు అనిల్ రావిపూడి ఇప్ప‌టికే ఆరు వరుస సూపర్ డూపర్ హిట్లు సినిమాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కాజల్ అగర్వాల్ – శ్రీలీల‌ ఉన్నారు. అటు బాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ రాంపాల్ విలన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తగిలే రేంజ్ లో ఉన్నాయి. ఇక సినిమా కోసం 24 లొకేషన్లు – 12 భారీ సెట్లు వేశారు. 8 నెలల‌లోనే రు. 100 కోట్ల బడ్జెట్ తో సినిమాను పూర్తి చేసేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ కావడమే మిగిలి ఉంది. ఈ సినిమాలో గతంలో ఎన్నడు చూడని బాలయ్యను చూడబోతున్నట్టు ఊరిస్తున్నాడు అనిల్.

ఇప్పటికే టీజర్ తో పాటు రిలీజ్ అయిన స్టిల్స్ లో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో బాలయ్య కచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్లు కొడతాడని అందరూ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. నందమూరి అభిమానులు.. బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు అందరూ అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్‌ కేసరి సినిమాలతో బాలయ్య హ్యాట్రిక్‌ హిట్లు కొడతాడని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతలా ఈ సినిమా మీద అందరికీ నమ్మకాలు ఉన్నాయి. బాలయ్య హ్యాట్రిక్‌ హిట్లు కొట్టి ఎప్పుడో ముప్పై ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఈ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అన్న అంచనాలు అయితే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news