Newsబాల‌య్య - త‌మ‌న్నా క్రేజీ కాంబినేష‌న్ వెన‌క‌...?

బాల‌య్య – త‌మ‌న్నా క్రేజీ కాంబినేష‌న్ వెన‌క‌…?

నందమూరి నటసింహం బాలకృష్ణ వచ్చే దసరా కానుకగా భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన బాలయ్య కొద్దినెలల‌ వ్యవధిలోనే భగవంత్ కేస‌రిగా బాక్సాఫీస్ దగ్గర గర్జింజ‌నున్నాడు.

ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కి సినిమాకు బాలయ్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఇప్పటికే జరుపుకుంది. ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని.. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. బాలయ్య కోసం బాబి అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా హీరోయిన్గా ఎవరిని ? తీసుకోవాలనే దానిపై త‌ర్జన భర్జ‌నలు జరుగుతున్నాయి. సీనియర్ హీరోయిన్లలో అనుష్క – నయనతార ఇద్దరు బాలయ్యతో నటించేశారు. తమన్నా మాత్రమే బాలయ్యతో బాకీ ఉంది. గతంలోనూ తమన్నా ఓసారి బాలయ్య సార్ తో నటించాలని ఉందంటూ త‌న‌ ఆకాంక్షను వ్యక్తం చేసింది.

ఇప్పుడు బాబి కూడా తమన్నా పేరు ఫైనల్ ఇచ్చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక‌ ప్రకటన రానుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా ఫిక్స్ అయితే ఇప్పటివరకు బాకీ ఉన్న బాలయ్య – తమన్నా జోడి కూడా వెండి తెరమీద చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు కలుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news