News' స‌లార్ ' కు బిగ్ షాక్‌... వాయిదా వేస్తే ఊరుకోం...

‘ స‌లార్ ‘ కు బిగ్ షాక్‌… వాయిదా వేస్తే ఊరుకోం అంటూ వార్నింగ్‌లు…!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చ‌ల్లినట్టు అయింది. ప్రభాస్ హీరోగా – కేజిఎఫ్ సీరియస్ సినిమాల‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు దేశవ్యాప్తంగా తారాస్థాయిలో ఉన్నాయి.

అయితే సినిమా వాయిదా వేస్తూ మేకర్స్ తీసుకున్న నిర్ణయంతో వీళ్లంతా డిసప్పాయింట్ అయ్యారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 28న సలార్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా వాయిదా పడడంతో మరో షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ముందుగా అనుకున్న డబ్బులు ఇవ్వబోమని.. తగ్గించాలని బయ్యర్ల నుంచి నిర్మాతలపై ఒత్తిడి మొదలైనట్టు తెలుస్తోంది.

నిర్మాతలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న డబ్బులు కట్టిన వాళ్లంతా ఒప్పుకోవటం లేదని టాక్. అంతేకాకుండా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బయ్యర్ల నుంచి నిర్మాతలపై పెద్ద ఒత్తిడి మొదలైనట్టు తెలుస్తోంది. కానీ నిర్మాతలు మాత్రం వచ్చే యేడాది మార్చి 22న విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు.

దీంతో ముందుగా ఈ సినిమా ఏపీ – తెలంగాణ హక్కుల కోసం రు. 160 కోట్లు చెల్లిస్తామని ముందుకు వచ్చిన బయర్లు అంతా ఇప్పుడు మార్చిలో రిలీజ్ అయితే 120 నుంచి 130 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా స‌లార్‌ వాయిదా పడడంతో బిజినెస్ పరంగా ఇది పెద్ద లాస్ అని చెప్పాలి. మరి రేపటి రోజున సలార్ థియేటర్లలో ఎలా విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news