Moviesవావ్: మరోసారి బాలయ్య తో రొమాన్స్ చేయబోతున్న హనీ రోజ్.. ఈసారి...

వావ్: మరోసారి బాలయ్య తో రొమాన్స్ చేయబోతున్న హనీ రోజ్.. ఈసారి ఏకంగా అలాంటి రోల్ లోనే..!?

సినిమా తెరపై కొన్ని కొన్ని కాంబోలు భళే సెట్ అవుతూ ఉంటాయి . మనం ఊహించం కానీ అలాంటి ఊహించని కాంబోను సెట్ చేసి డైరెక్టర్ మేకర్స్ అభిమానులకు కనులు విందుగా ఎంటర్టైన్మెంట్ ని ఇస్తూ ఉంటారు. కాగ అటువంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబో బాలయ్య – హనీ రోజ్. నందమూరి బాలయ్య ఎంతటి పెద్ద స్టార్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి అలాంటి ఆయన సినిమాలో అసలు క్రేజీ లేని కి బ్యూటీకి అవకాశం ఇస్తారని ఎలా అనుకుంటాం.

కానీ బాలయ్య ఇచ్చారు . వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన ఎటువంటి క్రేజ్ పాపులారిటీ లేని హనీ రోజ్ ని హీరోయిన్గా పెట్టుకున్నారు . ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది హనీ రోజ్. ఇప్పుడు ఏ షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ అయినా హనీ రోజే దర్శనమిస్తుంది. కాగ హనీ రోజ్ బాలయ్య కాంబోలో మరో సినిమా వస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక అయితే ఆ కోరికను నెరవేర్చబోతున్నాడు స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి .

అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది . శ్రీ లీల కూతురు పాత్రలో కనిపించబోతుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ చిన్న రోల్ లో హనీ రోజ్ కనిపించబోతుందట. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అని ..కానీ సినిమాలో మాత్రం భలే నవ్వులు పండిస్తుందని ..ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. వీళ్లు ఒక్కసారి కలిసిన నటిస్తేనే బాక్సాఫీస్ బద్దలైంది.. రెండోసారి కూడా నటిస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news