Movies"ఆ డైరెక్టర్ నన్ను బలవంతం చేసాడు"..షాకింగ్ విషయాని రివీల్ చేసిన రమ్యకృష్ణ..!!

“ఆ డైరెక్టర్ నన్ను బలవంతం చేసాడు”..షాకింగ్ విషయాని రివీల్ చేసిన రమ్యకృష్ణ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ డైనమిక్ యాక్టర్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రమ్యకృష్ణ . ఓ నీలాంబరిగా ఓ శివగామి దేవిగా ..ఆమె నటన ఎప్పటికీ మర్చిపోలేము. కాగ 50 ఏళ్లు దాటిన సరే ఇప్పటికి హీరోయిన్ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నింది రమ్యకృష్ణ . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో తన ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. కాగ రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య కృష్ణ.. ఆమెను ఓ డైరెక్టర్ బలవంతంగా తన సినిమాలో ఒక సీన్ చేయించుకున్నాడు అన్న విషయంపై ఓపెన్ అప్ అయింది.

రమ్యకృష్ణ మాట్లాడుతూ ..”నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా ఏది అంటే కచ్చితంగా నరసింహ మొదటి స్థానంలో ఉంటుంది . అసలు ఆ సినిమాని నేను ఇష్టపూర్వకంగానే చేయలేదు. నాకు ఆ సినిమాలో సౌందర్య పాత్ర నచ్చింది . ఆ పాత్ర చేయాలనుకున్నాను. కానీ డైరెక్టర్ నాకు విలన్ పాత్ర ఇచ్చాడు. నాలో అంత వైల్డ్ గా ఏం చూసాడో తెలియదు. అయితే ఈ సినిమాల్లో ఓ సన్నివేశంలో నేను సౌందర్యాన్ని నా కాళ్ళతో ఆమె తలను టచ్ చేయాల్సి ఉంటుంది . అయితే ఆ సీన్ నేను చేయను అంటే చేయను అంటూ డైరెక్టర్ కి చెప్పాను “.

“కానీ నా మాట వినలేదు .. బలవంతంగా నాతో ఆ సీన్ చేయించుకున్నారు .. ఆ సీన్ చేసినప్పుడు నేను ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు . ఆ తర్వాత ఎన్నోసార్లు సౌందర్య కి సారీ చెప్పాను . ఇప్పటికీ ఆ సినిమాలో ఆ సీన్ చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది.. నేనేనా అలాగ చేసింది అంటూ బాధ పడిపోతాను . కానీ అది చేసింది నేను కాదు నీలాంబరి పాత్ర అంటూ నన్ను నేను సముదాయించుకుంటాను. అలా నాకు తెలియకుండానే నేను ఈ సినిమాలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో లీనమైపోయినటించాను ” అంటూ చెప్పుకొచ్చింది . ఏ మాటకు ఆ మాట నరసింహ సినిమా హిట్ అవ్వడానికి రజనీకాంత్ ఎంత కారణమో..రమ్యకృష్ణ కూడా అంతే కారణం అని అప్పట్లో జనాలు చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news