Moviesక్రేజీ హీరోతో రౌడి హీరో బిగ్ మల్టి స్టారర్.. మరో అర్జున్...

క్రేజీ హీరోతో రౌడి హీరో బిగ్ మల్టి స్టారర్.. మరో అర్జున్ రెడ్డి 2 ..ఇక ఈ కుర్రాళ్లను ఆపగలమా!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో అనగానే అందరికి టక్కున గుర్తు వచ్చే పేరు విజయ్ దేవరకొండ . అలాంటి క్రేజీ స్దానాన్ని సంపాదించుకున్నాడు ఈ హీరో. ప్రజెంట్ ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్ టీజర్ ఫస్ట్ లుక్ పాటలు అన్నీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ ని అందుకున్నాయి .

అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా ఈవెంట్లో విజయ్ దేవరకొండ సమంత ఎలా రెచ్చిపోయి పర్ఫామెన్స్ ఇచ్చారో కూడా మనం చూసాం. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ లేటెస్ట్గా నటించిన సినిమా “కింగ్ ఆఫ్ కొత”. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది .ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం.

ఈ చిత్రాల ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ ఒకరితో ఒకరు చిట్ చాట్ చేసుకొని ముచ్చటించుకున్నారు . ఇలాంటి క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు . విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..”ఒకవేళ తాను మల్టీ స్టారర్ చేస్తే ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ కచ్చితంగా ఉండాలని అనుకుంటానని చెప్పుకొచ్చారు . ఇద్దరం కలిసి మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇదే విషయం నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజంగా తెరపై ఇద్దరు యంగ్ హీరోస్ మల్టీ స్టారర్ సినిమా చేస్తే కచ్చితంగా అది సినిమా ఇండస్ట్రీకి కొత్త బూస్టప్ ఇస్తుందని జనాలకు సైతం ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు . అయితే విజయ్ దేవరకొండ ప్రపోజల్ కి దుల్కర్ సల్మాన్ కూడా యాక్సెప్ట్ చేయడం అభిమానులకి మరింత కొత్త ఉత్సాహాన్ని నింపింది. చూడాలి మరి వీరిద్దరిని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో..త్వరలోనే వీళ్లిద్దరు మల్టీ స్టార్ అనౌన్స్మెంట్ వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news