Moviesదేవుడికి కూడా భయపడని రాజమౌళి.. దేనికి భయపడతాడో తెలుసా..? జక్కన్న ఇంత...

దేవుడికి కూడా భయపడని రాజమౌళి.. దేనికి భయపడతాడో తెలుసా..? జక్కన్న ఇంత పిరికివాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా .. దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళికి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరనే చెప్పాలి. శాంతినివాసం సీరియల్ తో డైరెక్టర్గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత ఎన్నో హిట్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు . ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా పరిచయమైన రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు అన్ని హిట్ అవ్వడం గమనార్హం .

అంతేకాదు అపజయమెరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి.. రీసెంట్ గానే కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు ఆశగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును సైతం తీసుకొచ్చారు . ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అడ్వెంచరెస్ సీన్స్ చేసి జనాలను భయపెట్టే రాజమౌళి పాము అంటే చాలా భయమట .

రీజన్ ఏంటో తెలియదు కానీ చిన్నప్పటినుంచి పాము అంటే గజగజ వణికి పోతాడట. అంతేకాదు ఏ సీరియల్స్ లో కానీ సినిమాలో కానీ పాము సీను వచ్చిందంటే కళ్ళు మూసేసుకుంటారట . ఒకవేళ అలా చూస్తే ఆయనకి రాత్రి కలలోకి వస్తుందని భయమట . అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ టైంలో ఓసారి సెట్ లోకి పాము వచ్చేస్తే భయపడిపోయి ఆమడ దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ..కానీ ఆ పాముని అక్కడి నుంచి పంపించేద్దాం అన్న ఆలోచన చేయలేదట . ఇదే విషయాన్ని పట్టుకొని రాంచరణ్ – ఎన్టీఆర్ చాలా సందర్భాలలో రాజమౌళిని ఏడిపించారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అయితే కొంతమందికి కొన్ని కొన్ని వస్తువులను కానీ కొన్ని కొన్ని అనిమల్స్ చూస్తే భయమేస్తుందని .. రాజమౌళి కూడా మనలాంటి సామాన్య కామన్ పీపులే కదా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news