Moviesవరుణ్ సందేశ్ జీవితాని నాశనం చేసింది నాగార్జుననేనా..? ..రాత్రికి రాత్రి తలరాతనే...

వరుణ్ సందేశ్ జీవితాని నాశనం చేసింది నాగార్జుననేనా..? ..రాత్రికి రాత్రి తలరాతనే మార్చేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో చిత్రవిచిత్రాలు జరుగుతూ ఉంటాయి అని అందరూ చెప్పడమే కానీ మనం కళ్లారా చూసింది ఎప్పుడూ లేదు . అయితే అలాంటి ఓ విషయం బయటపడి మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా నాగార్జున పేరు హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . జనరల్గా ఏ స్టార్ హీరో అయినా సరే మనం ఒక స్థానంలో ఉన్నామంటే ఆ స్థానానికి గౌరవిస్తూ నలుగురు ఆ స్థానానికి వచ్చేలా హెల్ప్ చేస్తూ ఉంటారు . చాలామంది ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులే ఉన్నారు . అయితే కొంతమంది ఎక్కడో హీరోలను పైకి రానికుండా తొక్కేస్తూ ఉంటారు .

ఆ కోవాలోకే వస్తాడు నాగార్జున అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పేరు సంపాదించుకున్న నాగార్జున హీరో వరుణ్ సందేశ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . దానికి కారణం వరుణ్ సందేశ్ ఖాతాలో పడాల్సిన బిగ్గెస్ట్ హిట్ ను రాత్రికి రాత్రి చేతులు మార్చేసాడు నాగార్జున అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఆ ప్రాజెక్టు మరేదో కాదు 100% లవ్.

సుకుమార్ దర్శకత్వంలో తెర్కెక్కిన ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ కథను ముందుగా వరుణ్ సందేశ్ తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట సుకుమార్ . కథను కూడా వివరించారట . వరుణ్ సందేశ్ కూడా ఓకే చేశారట. హీరోయిన్ తమన్నాతో ఆల్రెడీ హ్యాపీడేస్ లో కలిసి నటించిన ఎక్స్పీరియన్స్ ఉన్న కారణంగా ఫ్రెండ్షిప్ కారణంగా ఆమె కూడా ఓకే చేసిందట . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి నాగార్జున చేతులు మార్చేశాడు ఈ ప్రాజెక్టు అంటూ ప్రచారం జరిగింది . నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఆ ప్రాజెక్టులో వరుణ్ సందేశ్ ని తప్పించి హీరోగా నాగచైతన్యను యాడ్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వరుణ్ సందేశ్ పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఎవరికి ఈ విషయం చెప్పుకోవాలో తెలియక సైలెంట్ అయిపోయారట . రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపడింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news