Moviesవావ్ ఫొటో కేక‌.. ఒకే వేదిక మీద బాల‌య్య - ప‌వ‌న్...

వావ్ ఫొటో కేక‌.. ఒకే వేదిక మీద బాల‌య్య – ప‌వ‌న్ – చ‌ర‌ణ్ ( ఫొటోలు)

మన టాలీవుడ్ స్టార్ హీరోలను ఒకే చోట చూడటం అందరికీ ఇష్టమే. అయితే ఇలాంటి సంద‌ర్భాలు ఎప్పుడో కాని రావు. ఒక్కోసారి ఇలాంటి రేర్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వారి అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. తమ ఫేవరెట్ హీరోలు అందరూ ఒకే చోట.. ఒకే వేదిక మీద ఉంటే వారి ఉత్సాహానికి అస్సలు బ్రేకులు వేయలేం.

ఇలాంటి ఇంట్రెస్టింగ్ సంఘటన టాలీవుడ్ లో చోటుచేసుకుంది. టాలీవుడ్ కామెడీ కింగ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ కన్నెగంటి వివాహ వేడుకలో మన టాలీవుడ్ సెలబ్రిటీలు.. ప్రముఖులు సందడి చేశారు. ఈ వేదిక మీద కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ వేడుకల్లో నందమూరి నట‌సింహ బాలకృష్ణ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. దీంతో చూడ ముచ్చటగా ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు ఫుల్ హ్యాపీగా కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news