Moviesమెగా షాక్‌: గేమ్ చేంజ‌ర్ షూటింగ్ ఆగిపోయింది.. చేతులెత్తేసిన శంక‌ర్‌..!

మెగా షాక్‌: గేమ్ చేంజ‌ర్ షూటింగ్ ఆగిపోయింది.. చేతులెత్తేసిన శంక‌ర్‌..!

టాలీవుడ్ గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా గేమ్ చేంజ‌ర్‌. ఇండియ‌న్ కేమ‌రూర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సెన్షేష‌న‌ల్ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే రిలీజ్ కావాలి… అయితే షూటింగ్ ప‌లుమార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది.

శంక‌ర్ సినిమాలో ఆరు పాట‌ల‌కు ఒక్కో పాట‌కు ఏకంగా రు. 15 కోట్ల బ‌డ్జెట్ పెట్టార‌ని.. మొత్తంగా పాట‌ల‌కే రు.90 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని కూడా తెలుస్తోంది. బ‌డ్జెట్ దిల్ రాజు చెప్పిన అమౌంట్ క‌న్నా ఎక్కువ కావ‌డంతో రాజు సైతం శంక‌ర్‌పై కాస్త అస‌హ‌నం, అసంతృప్తి వ్య‌క్తం చేశారంటూ కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇటు గేమ్ చేంజ‌ర్‌తో పాటు అటు ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్ కూడా చేస్తుండ‌డంతో అస‌లు గేమ్ చేంజ‌ర్ షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అర్థం కావ‌ట్లేదు.

అస‌లు ఈ యేడాది సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడు షూటింగ్‌కు పూర్తిగా బ్రేక్ ప‌డింద‌ని.. చాలా న‌త్త‌న‌డ‌క‌న సాగుతుండ‌డంతో రాజు సైతం అసంతృప్తిగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ఈ యేడాది కూడా ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశ‌లే లేవ‌ని తెలుస్తోంది. ఇంకా షూటింగ్ చాలా పెండింగ్‌లో ఉంద‌ట‌. శంక‌ర్ ఓ ప‌ట్టాన షూటింగ్ తెమ‌ల్చ‌క‌పోవ‌డం.. అటు ఇండియ‌న్ 2 కూడా పినిష్ చేయాల్సి రావ‌డంతో బ‌డ్జెట్ కూడా కంట్రోల్ త‌ప్పేసిందంటున్నారు.

ఇక వ‌చ్చే యేడాది ఆగ‌స్టు లేదా ఆ త‌ర్వాత కానీ గేమ్ చేంజ‌ర్ రిలీజ్ అయ్యే ఛాన్సులు లేవ‌ని తెలుస్తోంది. ఏదేమైనా గేమ్ చేంజ‌ర్ రిలీజ్‌పై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చే వ‌ర‌కు ఈ సందేహాలు కంటిన్యూ కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news