Moviesబండ్ల గ‌ణేష్‌కు ' మెగా ' వార్నింగ్‌… దెబ్బ‌కు క్యాన్సిల్ చేశాడుగా…...

బండ్ల గ‌ణేష్‌కు ‘ మెగా ‘ వార్నింగ్‌… దెబ్బ‌కు క్యాన్సిల్ చేశాడుగా… మెగా ఫ్యామిలీతోనే ఆట‌లా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ యాక్షన్ సినిమాల‌ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గబ్బర్ సింగ్. 2012 సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సినిమా పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు 10 ఏళ్ల తర్వాత తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు.

అయితే అంతకంటే ముందే పవన్ పుట్టినరోజు కానుకగా పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా తెర‌కెక్కిన గుడుంబా శంకర్ సినిమాను ఆగస్టు 31న రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం రెండు రోజుల తేడాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు రీ రిలీజ్ అవుతుండడంతో మెగా అభిమానులు కూడా కాస్త గందరగోళానికి గురవుతున్నారు. అసలు తాము ఏ సినిమా కోసం హంగామా చేయాలి ? ఏ సినిమాను చూడాలి అన్నది వాళ్లకు కూడా సరైన క్లారిటీ లేదు.

మెగా ఫ్యామిలీ నుంచి బండ్ల గణేష్ కు ఏదో స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళిందో ఏమో కానీ.. బండ్ల గణేష్ తన సోషల్ మీడియా వేదికగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ క్యాన్సిల్ చేస్తున్నాం.. సరైన సమయంలో ఆ సినిమాను రీ రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించారు. బండ్ల గణేష్ ఎప్పుడైతే ఈ మెసేజ్ పెట్టాడో మొత్తానికి బండ్లకు మెగా వార్నింగ్ ఏదో గట్టిగా పని చేసింది.. అందుకే కాస్త వెనక్కి తగ్గి తన సినిమాను వాయిదా వేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీతోనే ఆట‌లు ఆడ‌కు బండ్ల అంటూ కూడా కొంద‌రు మెగాభిమానులు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇక రానున్న పవన్ పుట్టినరోజుకి గుడుంబా శంకర్ సినిమా మాత్రమే రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news