Moviesఆ విషయంలో రాజమౌళి కంటే అనిల్ రావిపూడినే 1000రెట్లు బెటర్..గట్స్ ఉన్న...

ఆ విషయంలో రాజమౌళి కంటే అనిల్ రావిపూడినే 1000రెట్లు బెటర్..గట్స్ ఉన్న మగాడు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అనిల్ రావిపూడి ఫ్యాన్స్ . సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు ఎస్.ఎస్ రాజమౌళి .దర్శకధీరుడుగా పాపులారిటి సంపాదించుకున్న రాజమౌళి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు . అంతేకాదు రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నారంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ పేరు సంపాదించేసుకున్నారు . అయితే అదే రేంజ్ ఎంత కాకపోయినా ఆ స్థాయికి దగ్గరగా ఉన్నాడు అనిల్ రావిపూడి .

ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి పేరుని సంపాదించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఓ హీరో విషయంలో అనిల్ రావిపూడి ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు. నందమూరి నట సింహం బాలయ్యతో ప్రజెంట్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరి అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే రాజమౌళి తన కెరియర్ లో ఎంతోమంది హీరోలను డైరెక్ట్ చేసిన బాలయ్యను మాత్రం డైరెక్ట్ చేయలేకపోయాడు .

కొన్నిసార్లు అవకాశాలు వచ్చిన ..అది వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . కానీ అనిల్ రావిపూడి మాత్రం గట్స్ తో వెళ్లి తాను అనుకున్న కథను ఓపెన్ గా బాలయ్యకు చెప్పి.. పట్టి పీడించి ఏడిపించి ఏదో విధంగా ఆయన కాల్ షీత్స్ లాగేసుకొని ఆయనతో సినిమాలు ఫైనలైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు తెరపై చిత్రీకరిస్తున్నారు . త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అలా కంపేర్ చేస్తే రాజమౌళి కన్నా అనిల్ రావిపూడి వెయ్యిరెట్లు బెటర్ అంటున్నారు అనిల్ రావిపూడి ఫ్యాన్స్ . చూడాలి మరి అనిల్ రావిపూడి బాలయ్య కాంబోలో సినిమా ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news