Moviesమెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన "క్లీం కారా".. ఒక్క దెబ్బతోనే తాత తలరాతనే...

మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన “క్లీం కారా”.. ఒక్క దెబ్బతోనే తాత తలరాతనే మార్చేసిందే..ఏకంగా 2000 కోట్లు లాభాలు!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెసెంట్ ఎంత హ్యాపీ మూమెంట్స్ ని ఎంత హ్యాపీ లైఫ్ నీ ఎంజాయ్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిన విషయమే . ఎప్పటినుంచో మెగా ఫ్యాన్స్.. మెగా కుటుంబం ఎదురుచూసిన గుడ్ న్యూస్ రానే వచ్చేసింది . పెళ్లైన 11 నెల తర్వాత మొదటి బిడ్డకి తల్లిదండ్రులు అయ్యారు మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన . ఈ క్రమంలోని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని .. గుడ్ న్యూస్ ని కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు .. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా కుటుంబం కూడా మెగా ఫాన్స్ కూడా ఎంజాయ్ చేసింది ..సంబరాలు చేసుకున్నారు.

ఆ తర్వాత బారసాల చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురికి “క్లీం కారా” అంటూ లలితా సహస్రనామంలోని ఓ పవర్ఫుల్ పేరును పెట్టుకొచ్చారు. అయితే మెగా మనవరాలు ఈ భూమి మీదకి రాకముందు నుంచి తన లక్కీ వైబ్స్ ని మెగా ఫ్యామిలీ పై చూపించింది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ పెళ్లి ..చరణ్ ఆస్కార్ అవార్డు ..ఇలా తాను మా ఇంట్లోకి రాకముందే మా ఇంటికి ఎన్నో శుభకార్యాలను తీసుకొచ్చింది. అయితే ఈ టైంలో చిరంజీవి కొంచెం ఓవర్ చేస్తున్నాడు అన్న కామెంట్లు కూడా వినిపించాయి.

అయితే ఫైనల్ ని అదే నిజమైంది . మెగా మనవరాలు ఇంటికి వచ్చిన వేళా విశేషం మెగాస్టార్ చిరంజీవికి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా 2000 కోట్లు లాభాలు వచ్చాయి . దానికి కారణం రీసెంట్ గానే కోకాపేటలో ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడమే. ఏకంగా అక్కడ ఎకరం భూమి ధర 100 కోట్లు పలుకుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలోనే ఇది ఓ సంచలనం అని బిజినెస్ నిపుణులు చెప్పుకొస్తున్నారు . అయితే మెగాస్టార్ చిరంజీవికి కోక పేటలో అన్ అఫిషియల్ రికార్డు లెక్కల ప్రకారం 30 ఎకరాల భూమికి పైగానే ఉందట . ఈ లెక్కలు చూసుకుంటే చిరంజీవికి సడన్గా 2000 కోట్లు విలువ చేసే లాభాలు వచ్చినట్లే అంటున్నారు సినీ ప్రముఖులు. దీంతో మెగా మనవరాలు మెగా ఫ్యామిలీకి మరింత లక్కీగా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news