Moviesఆ హీరో కోసం 6 రోజులు అన్నం మానేసిన శ్రీదేవి.. ఎందుకో...

ఆ హీరో కోసం 6 రోజులు అన్నం మానేసిన శ్రీదేవి.. ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఓ హీరో కోసం 6 రోజులు తిండి మానేసింది. ఆ హీరో మరెవరో కాదు రజనీకాంత్ . కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రజినీకాంత్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కాంబినేషన్లో దాదాపు 22 సినిమాల వరకు వచ్చాయి. ఇది కేవలం ఒక్క భాష కాదు దాదాపు నాలుగు భాషలు అంటే.. తెలుగు – హిందీ – కన్నడ – తమిళం భాషల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు దాదాపు 22 ఉండొచ్చు అంటూ తెలుస్తుంది .

అయితే ఇలా వీళ్ళు కలిసి నటించే టైం లో రజనీకాంత్ శ్రీదేవి మధ్య మంచి స్నేహం ఏర్పడింది . ఎంతలా అంటే శ్రీదేవి అమ్మగారు రజినీకాంత్ ని ” నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా ..?”అని అడిగేంతలా.. వీళ్ళ మధ్య సన్నిహిత్యం ఏర్పడింది . అయితే వీరిద్దరి కాంబో తెరపై సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల జనాలు కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఆశపడ్డారు . కానీ అది జరగలేదు. వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే వాళ్ళు . ఈ క్రమంలోనే రజినీకాంత్ రోజురోజుకీ వెయిట్ పెరిగిపోతూ ఉండడంతో ఆరోగ్యం క్షీణిస్తూ రావడంతో.. హాస్పిటల్లో అడ్మిట్ చేశారట.

ఆ తర్వాత ఆయన కండిషన్ మరింత క్రిటికల్ గా మారిందట. ఈ క్రమంలోనే చాలామంది ఫ్యాన్స్ సైతం ఆయన పై ఆశలు కూడా వదిలేసుకున్నారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోనే రజినీకాంత్ కి మంచి ఫ్రెండ్ అయినా శ్రీదేవి ఏకంగా ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆరు రోజులు షిరిడి సాయిబాబాకు ఉపవాసం ఉండిందట . అంతేకాదు పూణేలోని సాయిబాబా టెంపుల్ ని దర్శించుకుని త్వరగా రజినీకాంత్ అస్వస్థత నుండి కోలుకొని సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని మొక్కుకునిందట . ఆశ్చర్యం ఏంటంటే డాక్టర్స్ వాళ్ళ కానిది కూడా భగవంతుడి వల్ల అయింది. శ్రీదేవి అలా మొక్కుకుని ఉపవాసం ఉన్న ఆరు రోజులకే రజనీకాంత్ పూర్తి ఆరోగ్య వంతుడిగా కోలుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news