Moviesఈ పవన్ కళ్యాణ్ చెల్లి ..ఆ స్టార్ హీరోని నమ్మించి నిలువునా...

ఈ పవన్ కళ్యాణ్ చెల్లి ..ఆ స్టార్ హీరోని నమ్మించి నిలువునా ముంచేసిందా..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉంటారు. ఆ లిస్టులోకి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బ్లూ కలర్ శారీ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు సంధ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ..అసిన్ హీరోయిన్గా నటించిన అన్నవరం సినిమాలో.. సిస్టర్ క్యారెక్టర్ లో మెరిసింది . ఈ సినిమా మొత్తం సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కింది . ఈ సినిమా లో సంధ్య – పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ .. అన్నాచెల్లెలకి ఎంత గుర్తుండిపోతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ సినిమాకి గాను సంధ్య ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. అంతగా ఈ సినిమాలో వాళ్ళ ఎమోషన్స్ పండాయి. సంధ్య వెండి తెర పై కనిపించి చాలా కాలమే అయిపోతుంది . అయితే గతంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడన్ని సినిమాల్లో నటించి సూపర్ హిట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ..తమిళ్లో “కాదల్” అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ..ఆ సినిమాలో బాయ్ ఫ్రెండ్ ని చీట్ చేసిన అమ్మాయిగా జీవించేసింది. ఈమె నటన చూసి నిజంగానే ఆ అమ్మాయి అబ్బాయిని చీట్ చేసిందా అని అంత తిట్టుకున్నారు. అలా నటించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత తెలుగు తమిళ భాష లో పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది . ఈ క్రమంలోనే 2015 చెన్నైకి చెందిన అర్జున్ ని వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఈ సంధ్య ప్రెసెంట్ భర్తతో చెన్నైలోనే ఉంది . కానీ సోషల్ మీడియాకి బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది . 2016లో ఈ దంపతులకు దంపతులకు ఒక పాప జన్మించింది . ప్రస్తుతం సంధ్య హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. చూడాలి మరి అందరిలాగే ఈమె కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news