Moviesత‌రుణ్ కోసం న‌లుగురు స్టార్ హీరోయిన్లు వెంట‌ప‌డ్డారా… ఆ సీక్రెట్ ఇదే…!

త‌రుణ్ కోసం న‌లుగురు స్టార్ హీరోయిన్లు వెంట‌ప‌డ్డారా… ఆ సీక్రెట్ ఇదే…!

టాలీవుడ్ లో సీనియర్ హీరో తరుణ్ అంటే ఒకప్పుడు తిరుగులేని క్రేజ్ ఉండేది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఆ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా చాలా సెంటర్లలో ఏడాది పాటు ఆడింది. కొన్నిచోట్ల అయితే 500 రోజులు కూడా ఆడి సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా నువ్వే కావాలి – ప్రియమైన నీకు – నువ్వు లేక నేను లేను, నువ్వే న‌వ్వే లాంటి సూపర్ డూపర్ హిట్లతో తరుణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఆ టైంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ డం ఉన్న హీరోలు ఉన్నా కూడా తరుణ్ డేట్ల కోసం స్టార్ నిర్మాతలు ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అంత స్టార్ డ‌మ్‌ తెచ్చుకున్న తరుణ్ చిన్న చిన్న రాంగ్ స్టెప్పులతో ఒక్కసారిగా పాతాళంలో పడిపోయాడు. ఇందుకు తరుణ్ సొంత తప్పిదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్తో తరుణ్ ప్రేమాయణం తరుణ్ కెరీర్ కి శాపంగా మారిందని అంటారు. ఒకవేళ తరుణ్ ఆర్తిని పెళ్లి చేసుకునే ఉంటే.. ఆర్తితో పాటు తరుణ్ కెరీర్ మరో రేంజ్ లో ఉండేదని కూడా అంటూ ఉంటారు.

అప్పట్లో తరుణ్‌తో నటించేందుకు స్టార్ హీరోయిన్లు కూడా వెంటపడేవారట. ముఖ్యంగా ఏఎం రత్నం నిర్మించిన నీ మనసు నాకు తెలుసు సినిమాలో త్రిష, ఇటు ఆర్తి అగర్వాల్, శ్రేయ, ప్రియమణి లాంటి హీరోయిన్లు కూడా తరుణ్ పక్కన నటించారు. తరుణ్ కుర్ర హీరో అయినా కూడా అతడి పక్కన నటించడంలో చాలా కంఫర్టబుల్గా ఫీలయ్యావారట ఆ స్టార్ హీరోయిన్లు. త‌రుణ్‌తో నటించిన హీరోయిన్లు తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ అయి టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు.

అందుకే అప్పటి కుర్ర హీరోయిన్లు.. స్టార్ హీరోయిన్లు అందరూ తరుణ్‌తో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునేవారట. అంతెందుకు త్రిష లాంటి హీరోయిన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. శ్రేయ కూడా పెళ్ల‌య్యి బిడ్డ త‌ల్లి అయినా కూడా అడపా సినిమాలు చేస్తుంది. ప్రియమణి కూడా వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది. అందుకే అప్పట్లో తరుణ్ పక్కన నటించేందుకు స్టార్ హీరోయిన్లు కూడా క్యూ కట్టేవారట. తరుణ్ సినిమా అంటే ఎలాంటి ? కండిషన్లో లేకుండానే ఓకే చెప్పేవారని అప్పటి సినీ విశ్లేషకులు చెప్పేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news