Movies"ఫైనల్లీ..నన్ను అర్ధం చేసుకునేవాళ్లు దొరికేసారు"..అసలు విషయం బయటపెట్టేసిన సమంత..!!

“ఫైనల్లీ..నన్ను అర్ధం చేసుకునేవాళ్లు దొరికేసారు”..అసలు విషయం బయటపెట్టేసిన సమంత..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో సమంత విడాకులు తీసుకున్న తర్వాత మరింత స్థాయిలో ట్రోలింగ్కి గురవుతుంది. కాగా రీసెంట్ గా ఆమె మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్ళింది.

తన తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సమంత న్యూయార్క్ వీధుల్లో తెగ చక్కెరలు కొడుతుంది. ఈ క్రమంలోనే అక్కడ సరదాగా గడిపిన ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది . కాగా ఇలాంటి క్రమంలోనే సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది . తన కోరికను అర్థం చేసుకున్నవారు దొరికారు.. ఫైనల్లి తనకు కావాల్సింది దక్కింది అంటూ పోస్ట్ చేసింది . అయితే ఆ ఫోటోలు ఆమె చేతిలో కాఫీ కప్ కూడా ఉండడం గమనార్హం.

సమంతకి కాఫీ అంటే మహా మహా పిచ్చి.. ఎలాంటి డైట్ చేసిన కాఫీ తాగాల్సిందే. అయితే పాపం న్యూయార్క్ వెళ్ళినప్పుడు కాఫీ కరువైనట్లుంది. అందుకే అమ్మడు కాఫీని చూడగానే ఉబ్బి తబ్బిపోయింది . ఎవరో ఆమెకు జంబో సైజ్ కాఫీని ఇచ్చారు . ఈ క్రమంలోనే ఆ ఫోటోని షేర్ చేస్తూ సమంత హ్యాపీనెస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది . కోట్లు సంపాదించే సమంత చిన్న విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందపడుతుందా..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రీసెంట్ గానే జిమ్ లో ఓ అబ్బాయి తో కనిపించి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news