Newsనాని వీక్‌నెస్ బాల‌య్య‌కు కూడా అంటుకుందా... బాబి - బాల‌య్య సినిమా...

నాని వీక్‌నెస్ బాల‌య్య‌కు కూడా అంటుకుందా… బాబి – బాల‌య్య సినిమా స్టోరీ ఇదే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే దర్శకుడు బాబి – బాలయ్య కాంబినేషన్లో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ కి ఒక వీక్నెస్ ఉంటుంది అని.. అది మతిమరుపు అని ఆ సినిమాలో మెయిన్ స్క్రీన్ ప్లే మొత్తం ఈ వీక్నెస్ మీద నడుస్తుందని తెలుస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో నానికి ఉన్న మ‌తిమ‌రుపు వీక్‌నెస్‌లా చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఈ క‌థ ఉంటుంద‌ట‌. బాలయ్య మతిమరుపు దాని చుట్టూ వచ్చే యాక్షన్ సీన్లు.. కామెడీ సీన్లు మెయిన్ హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది.

అలాగే ఫ్యామిలీ, ఎమోషన్లు సెంటిమెంట్ కూడా ఉండేలా దర్శకుడు బాబి చాలా కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బాలయ్య టైపు కంప్లీట్ యాక్షన్ డ్రామా కాదు అని.. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్.. ఎమోషనల్ డ్రామా అని.. దీనికి తోడు బాలయ్య మతిమరుపు కూడా సినిమాలో కీ పాయింట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య ఈసారి కొత్తగా కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అలాగే పాలిటిక్స్ నేపథ్యంలో ఓ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుంద‌ట.

బాబి ఇప్పటికే వాల్తేరు వీర‌య్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇటు కూడా ఫామ్ లో ఉన్న బాలయ్యతో సినిమా అంటే మామూలు అంచనాలు ఉండవు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుంది. మిల్కీ బ్యూటీ తమన్న పేరు హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news