Newsప్రేమ‌లో ర‌ష్మీ ఇన్నిసార్లు మోస‌పోయిందా.. ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయ్యిందిగా..!

ప్రేమ‌లో ర‌ష్మీ ఇన్నిసార్లు మోస‌పోయిందా.. ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయ్యిందిగా..!

యాంకర్ రష్మీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీరిద్దరూ ఏ క్షణాన కలిశారో గాని ఈ జంట తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్ లో బాగా హాట్‌ టాపిక్ అయిపోయారు. గత 7 – 8 సంవత్సరాల నుంచి తెలుగు బుల్లితెరపై వీళ్ళ జోడిని కొట్టే కాంబినేషన్ రాలేదు. అలాంటిది కొన్నాళ్లుగా సుధీర్ – రష్మి కలిసి కనిపించడం లేదు. దీంతో చాలామంది ప్రేక్షకులు నిరుత్సాహంలో ఉన్నారు.

ఇలాంటి టైంలో తాజాగా రష్మి తన బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా. మారాయి ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ – శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. వీటితో పాటు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఇటీవల భోళాశంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి ఒక పాటలో స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. తాజాగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగులో ఆగస్టు 25న రిలీజ్ అవుతున్న బాయ్స్ హాస్టల్స్ సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేసింది.

ఈ సినిమా ఈవెంట్లో రష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో హార్ట్ బ్రేక్స్ గురించి చెబుతూ ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్ బ్రేక్స్ – సంబంధాలు చాలా ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చాలామంది ఇవన్నీ చేస్తూనే ఉంటారు. నా బ్రేక‌ప్ గురించి కౌంట్ చేసి చెప్పటం చాలా కష్టం అని చెప్పింది. ర‌ష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆమె మనసు కూడా ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ అయిందని తెలుస్తోంది.

అంటే రేష్మి.. సుడిగాలి సుధీర్ తో కూడా తనకు బ్రేకప్ జరిగిందని చెప్పిందా ? ఆమె ఎందుకు ఇంత ఆవేద‌న‌తో మాట్లాడింది అన్నది అర్థం కావటం లేదు. ప్రస్తుతం ఈ వాక్యాలు అయితే హాట్‌ టాపిక్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news