Movies"సామజవరగమన" లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్న...

“సామజవరగమన” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్న ..ఆ తెలుగు దురదృష్టవంతుడు ఇతనే..!!

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది . భారీ భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సినిమాలన్నీ బొక్క బోర్లా పడుతున్నాయి. కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి . అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదా సీదా గా రిలీజ్ అవుతున్న సినిమాలు కోట్లకు కోట్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అలాంటి లిస్ట్ లోకే ఆడ్ అయిపోయాడు హీరో శ్రీ విష్ణు.

ఆయన నటించిన “సామజవరగమన” చిత్రం ఇటీవల విడుదలై.. ఎలాంటి సూపర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా జూన్ 29న గ్రాండ్గా రిలీజై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది . నటుడిగా శ్రీ విష్ణుకు మంచి ఇమేజ్ను తెచ్చి పెట్టింది . శ్రీ విష్ణు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది అని చెప్పవచ్చు . అయితే ఇంత మంచి కథను మిస్ చేసుకున్న తెలుగు హీరో పై ఇప్పుడు జనాలు మండిపడుతున్నారు.

కాగ దా ఈ సినిమా డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ కథను ముందుగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కి వివరించారట. అయితే ఈ కథ తన కంటే హీరో శ్రీ విష్ణు కి బాగా సూట్ అవుతుందని అందుకని అతగాడితో ఈ సినిమా తీస్తే బాగుంటుంది అని సందీప్ కిషన్ స్వయంగా సజెస్ట్ చేశారట . అదే టైంకి సందీప్ కిషన్ “మైఖెల్” అనే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో బిజీగా ఉండడంతో ఈ స్క్రిప్ట్ నచ్చిన సరే వదులుకోక తప్పలేదు . దీంతో ఈ కథ సందీప్ కిషన్ చేతుల నుంచి శ్రీ విష్ణు చేతికి వెళ్ళింది . ఏ మాటకు ఆ మాటే ఈ కథలో సందీప్ కిషన్ కన్నా శ్రీ విష్ణు నే బాగా నటించగలిగాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అలా సందీప్ కిషన్ ఈ సినిమాను వదులుకొని దురదృష్టవంతుడు లిస్ట్ లోకి యాడ్ అయిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news