Movies'బేబీ' సినిమా పై డైరెక్టర్ రాఘవేంద్రరావు సంచలన కామెంట్స్.. "సినిమా మొత్తానికి...

‘బేబీ’ సినిమా పై డైరెక్టర్ రాఘవేంద్రరావు సంచలన కామెంట్స్.. “సినిమా మొత్తానికి అవే నచ్చాయట”..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు సినిమాల ద్వారా పాపులారిటీ క్రేజ్ సంపాదించుకున్న ఈయన రీసెంట్ గానే బేబీ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఏకంగా 23.5 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ .

యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వీరాజ్ అశ్విన్ ఓ కీలక పాత్రలో కనిపించారు . మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ లవ్ ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ తో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే ఈ సినిమా పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ రష్మిక మందన -విజయ్ దేవరకొండ – రాశిఖన్నా లాంటి స్టార్స్ ఈ సినిమా టీం కు విషెస్ అందించారు .

తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు ప్రముఖ సినీ డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు . జగదేకవీరుడు అతిలోకసుందరి – అన్నమయ్య – శ్రీరామదాసు – ఘరానా మొగుడు – హిమ్మత్వాలా వంటి ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ఈయన రీసెంట్గా బేబీ సినిమా చూశానని ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు . ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ..” బేబీ సినిమా చూశాను. చాలా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాను .. ఈ సినిమాకు సాయి రాజేష్ చక్కటి దర్శకత్వం వహించారు.. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య- వీరాజ అశ్విన్ చాలా అద్భుతంగా నటించారు. నేటి జనరేషన్ ఎలా ఉందో క్లియర్ గా చూపించారు . మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది “. అంటూ ట్వీట్ చేశాడు. అయితే సినిమాలో నటుల పర్ఫామెన్స్ల కన్నా ఎక్కువగా మ్యూజిక్ బాగా నచ్చింది అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చాడు రాఘవేంద్రరావు . దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మ్యూజిక్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news