Moviesరాజ‌మౌళి కెరీర్ లోనే న‌ష్టాలు మిగిల్చిన ఏకైక మూవీ ఇదే.....

రాజ‌మౌళి కెరీర్ లోనే న‌ష్టాలు మిగిల్చిన ఏకైక మూవీ ఇదే.. జక్కన్న ఏం చేసాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి . స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పటివరకు తన ఖాతాలో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా వేసుకోలేదు అన్న విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీని తన డైరెక్షన్ తో శాసిస్తున్న రాజమౌళి త్వరలోనే మహేష్ బాబు తో కలిసి ఓ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు .

రీసెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన రాజమౌళి .. ఈ సినిమాతో కూడా మరో ఆస్కార్ ని తీసుకొస్తారు అని మహేష్ బాబు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజమౌళి తన కెరీర్ లో అన్ని సినిమాలు తెరకెక్కించిన..ఆయన పెట్టిన దానికి డబల్ ట్రిపుల్ లాభాలు తీసుకొచ్చాయి. అయితే ఒక సినిమా మాత్రం ఆయనను డిసప్పాయింట్ చేసింది. ఆ సినిమా మరేదో కాదు “సై”.

టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నితిన్ – జెనీలియా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు . శశాంక్ – ప్రదీప్ -రాజీవ్ కనకాల తదితరులు కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమా టాక్ పరంగా సూపర్ హిట్ అయింది . అయితే కలెక్షన్స్ పరంగా డిసప్పాయింట్ చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులని తెగ ఆకట్టుకునింది . అయితే కమర్షియల్ గా మాత్రం హిట్ కొట్టలేకపోయింది. 24 సెప్టెంబర్ న విడుదలైన ఈ మూవీ ఎనిమిది కోట్ల బడ్జెట్తో నిర్మితమైతే లాంగ్ రన్ లో 12 కోట్లు సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ హిట్టే కానీ మిగతా రాజమౌళి సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఫట్ అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news