Movies"సినిమాలైన ఆపేస్తా.. చచ్చినా అలా చేయను".. ఉన్నది ఉన్నట్లు పచ్చిగా చెప్పేసిన...

“సినిమాలైన ఆపేస్తా.. చచ్చినా అలా చేయను”.. ఉన్నది ఉన్నట్లు పచ్చిగా చెప్పేసిన అనుష్క ..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లు అడుగుపెట్టేది డబ్బు కోసం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ డబ్బు కోసమే నానా రకాలుగా బాధలు పడి కడుపు మాడ్చుకొని అన్నం తినకుండా జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ..ముఖానికి రంగులు పూసుకొని ..ఇష్టం లేని పాత్రలో కూడా నటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మల సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదలు ఫేడ్ అవుట్ అయిపోయే వరకు ఎక్కువగా డబ్బు డబ్బు అంటూనే ఆలోచిస్తూ ఉంటారు.

మరి కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు . సెకండ్ కేటగిరీలోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అనుష్క శెట్టి . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈమె కొన్ని దశబ్ధాలు దాటేస్తుంది. అయినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

అయితే అనుష్క శెట్టి హైట్ కి వెయిట్ కి టాలెంట్ కి బాలీవుడ్ నుంచి బడాబడా అవకాశాలు వచ్చాయట . కానీ అనుష్క శెట్టి ఒక కారణంతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయలేదు అంటూ తెలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి అని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు అలాంటి కంటెంట్ వద్దు అంటూ డైరెక్టర్ లు చెప్పుకొచ్చిన తర్వాత మాత్రం విచ్చలవిడిగా హద్దులు మీరే ప్రయత్నం చేయిస్తారని.. ఆ కారణంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లదలచుకోవట్లేదు ” అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో సోషల్ మీడియాలో అనుష్క పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. త్వరలోనే అనుష్క నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా హిట్ అయితే అనుష్క కెరియర్ మళ్ళీ ట్రాక్లో పడ్డట్టే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news