Moviesస్టేటస్ బ్యాచ్ కు కేంద్రం బిగ్ షాక్.. సినిమాలు రికార్డ్ చేసి...

స్టేటస్ బ్యాచ్ కు కేంద్రం బిగ్ షాక్.. సినిమాలు రికార్డ్ చేసి స్టేటస్ పెడితే మూడేళ్ళు జైలు శిక్ష..!!

ఈ మధ్యకాలంలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు చేసే పని.. ఏదైనా సరే సరదా వీడియోస్ ..ఫన్నీ ఫొటోస్ స్టేటస్ గా పెట్టుకొని నలుగురికి ఆ విషయం తెలియజేస్తూ ఉంటారు . అయితే మరి ముఖ్యంగా సినిమా లవర్స్ తమ హీరోల కి సంబంధించిన వీడియోస్ – ట్రైలర్స్ – టీజర్స్ ఇలా ఎప్పటికప్పుడు స్టేటస్ లు పెట్టి తమ అభిమాన హీరో సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు జనాలు.

మరి ముఖ్యంగా తమ హీరో నటించిన సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ..ఫస్ట్ షో కి వెళ్లి ఆ హీరో ఎంట్రీ సీన్.. ఆ హీరో డైలాగ్ చెప్పే సీన్స్ రికార్డ్ చేసి మరి సినిమా రిలీజ్ అయిన 24 గంటలకు ముందే తమ స్టేటస్ లో పెట్టి అందరికీ తెలియజేసేలా చేస్తూ ఉంటారు. అయితే ఇకపై అలా చేస్తే మూడేళ్లు జైలు శిక్ష తప్పదు అంటూ కేంద్రం కొత్త రూల్ తీసుకువచ్చింది . ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా రీసెంట్ గా కేంద్రం సినిమాటోగ్రఫీ బిల్లులో పలు సవరణలు చేసింది . మరీ ముఖ్యంగా 1984 తర్వాత కేంద్రం సినిమాటోగ్రఫీ బిల్లుకు మేజర్ సవరణలు చేసి రీసెంట్ గానే రాజ్యసభలో -లోక్ సభలో ఆ బిల్లుని ఆమోదం పొందేలా చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ . కాగా రీసెంట్గా రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకి సంబంధించిన కొన్ని సవరణలు చేశారు అనురాగ్ ఠాకూర్ . కాగా ఈ బిల్లు ప్రకారం ఇక ఎవరైనా సరే సినిమా పైరసీకి పాల్పడిన ..లేక సినిమా థియేటర్లో వాట్సాప్ స్టేటస్ కోసం సెల్ ఫోన్లో రికార్డింగ్లు చేస్తూ పట్టుబడిన జైలుకు వెళ్లాల్సిందే అంటూ కొత్త కండిషన్ తీసుకొచ్చారు . ఈ కొత్త సవరణల ప్రకారం పైరసి చేస్తూ పట్టుబడితే గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు . అంతే కాదు జరిమానా కూడా విధించవచ్చు . సినిమా నిర్మాణానికి ఆయన మొత్తం ఖర్చులు ఐదు శాతం కట్టాల్సి ఉంటుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news