Moviesచిక్కుల్లో మెగా హీరో.. శ్రీకాళహస్తిలో పెద్ద అపచారం చేసిన సాయిధరమ్ తేజ్..!!

చిక్కుల్లో మెగా హీరో.. శ్రీకాళహస్తిలో పెద్ద అపచారం చేసిన సాయిధరమ్ తేజ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ మెగా హీరోగా పేరు సంపాదించుకున్న హీరో సాయిధరమ్ తేజ్ చిక్కుల్లో ఇరుకున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “బ్రో-ది అవతార్”. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ముందు దైవదర్శనం చేసుకుంటున్న సాయిధరమ్ తేజ్.. రీసెంట్గా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు . అంతవరకు బాగానే ఉన్నా.. సాయి ధరంతేజ్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. అర్చకులు లేకపోవడంతో స్వయంగా హారతి ఇచ్చాడు. దీంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది .

అయితే భక్తులు దీనిపై మండిపడుతున్నారు . ఆలయ నియమ నిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామి వారికి హారతులు ఇవ్వాలి. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన వాళ్ళకి అధికారం ఉండదు . మరి సాయిధరమ్ తేజ్ ఎలా అలాంటి పని చేశారు అంటూ మండిపడుతున్నారు . దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది . అంతేకాదు ఇది పెద్ద అపచారమని త్వరలోనే దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటాడు సాయిధరమ్ తేజ్ అని చెప్పుకొస్తున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చిన వీడియో క్లిప్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news