Movies"యస్..అది నిజమే.. పెళ్లికి ముందు ఒక్కే ఇంట్లో ఉన్నారు"..మనోజ్-మౌనిక మ్యారేజ్ సీక్రేట్...

“యస్..అది నిజమే.. పెళ్లికి ముందు ఒక్కే ఇంట్లో ఉన్నారు”..మనోజ్-మౌనిక మ్యారేజ్ సీక్రేట్ ని ఓపెన్ గా చెప్పేసిన లక్ష్మి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీ గా పేరు సంపాదించుకున్న మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పలు రకాల వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ విషయాలకు క్లారిటీ ఇచ్చేసింది మంచు ఆడపడుచు లక్ష్మి . మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది లక్ష్మి మంచు.

సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారాలపై తన ఫ్యామిలీ పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ మంచు మనోజ్ – మౌనికల పెళ్ళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది . ఆమె మాట్లాడుతూ..” మనోజ్- మౌనిక చాలా ట్రూ గా ప్రేమించుకున్నారు. వీళ్ళ పెళ్లి జరిగితే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను. చాలా ట్రై చేశాను . అయినా సరే ఎందుకో అది కుదరలేదు . ఇద్దరు బడా ఫ్యామిలీ కావడం పైగా ఇద్దరు రెండో పెళ్లి కావడం తో ఎక్కువ ఆలోచించారు “.

“అయితే వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉండటం చూడలేక నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్లి మొక్కుకున్నాను..అలా మొక్కుకున్నానో లేదో ఇలా పెళ్లయిపోయింది. అందుకే పెళ్లి తర్వాత జంటను అక్కడికి తీసుకెళ్లి దండం పెట్టించుకుని వచ్చాను. పెళ్లికి ముందు కొన్ని రోజులు ఇద్దరు నా ఇంట్లోనే ఉండేవాళ్ళు ..ఇప్పుడు పెళ్లి తర్వాత వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోయారు ..ఇప్పటికీ ఇంటిలో సమస్యలు వచ్చినా.. ఏ డౌట్ వచ్చినా మౌనిక నాకే ఫోన్ చేస్తుంది . నేను సరదాగా ఆట పట్టిస్తూ చెప్పను పో చెప్పను పో అంటూ ఉంటాను. ప్రెసెంట్ వాళ్లిద్దరూ హ్యాపీగా ఉన్నారు నాకు అదే చాలు “అంటూ క్లారిటీ ఇచ్చింది .దీంతో మంచు లక్ష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news