News"అది రూమర్ కాదు నిజమే"..బిగ్ బాంబ్ పేల్చిన జబర్ధస్త్ వర్ష.. ఇంత...

“అది రూమర్ కాదు నిజమే”..బిగ్ బాంబ్ పేల్చిన జబర్ధస్త్ వర్ష.. ఇంత షాక్ ఇచ్చింది ఏంటి రా బాబు..!?

బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం ఎలాంటి టాప్ రేంజ్ టిఆర్పిస్ ని దక్కించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో వైవిద్య భరితమైన షోస్ ఎంట్రీ ఇచ్చాయి . కానీ ఇప్పటికి జబర్దస్త్ నెంబర్ వన్ టాప్ టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుంటుంది అంటే కారణం మాత్రం జబర్దస్త్ లో వర్క్ చేసే కాంటెస్ట్ అనే చెప్పాలి . మరి ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే ఈ వర్ష .

ఇమ్మానుయేల్ తో కలిసి కొన్ని స్కిట్స్ చేసి ఆ తర్వాత సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీగా మారిన వర్ష ప్రెసెంట్ రెండు చేతుల్లారా బాగానే సంపాదిస్తుంది . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్ష జబర్దస్త్ లో జరిగే ఓ విషయం గురించి ఓపెన్ అప్ అయింది . కాగా జబర్దస్త్ లో కొన్ని కొన్ని సార్లు కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ కన్నీరు పెడుతూ ఉంటారు . అయితే అదంతా ఫేక్ అని ..డబ్బులు ఇచ్చి అలా ఏడవమని చెప్తారని చాలామంది జనాలు భావిస్తూ ఉంటారు.

అయితే అదంతా ఫేక్ కాదు నిజమే అంటూ చెప్పుకొచ్చింది వర్ష. ” డబ్బులు ఇస్తే కన్నీళ్లు రావు కొన్ని కొన్ని సార్లు ఆ ఎమోషన్స్ నిజమే.. తోటి కంటెస్టెంట్స్ బాధలు విన్నప్పుడు మాకు నిజంగానే ఏడుపొస్తుంది ..అవి అంత ఫేక్ గ్లిజరిన్ అయితే కాదు ..మాకు బాధలుంటాయి ..మేము డబ్బు కోసమే తెరపై నటిస్తున్నాం.. మా బాధలను అర్థం చేసుకోండి ..కించపరచకండి “అంటూ చెప్పుకు వచ్చింది వర్ష. దీంతో వర్ష చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news