Newsగాల్లో రెండు కాళ్లు పైకి ఎత్తిన సమంత.. చూస్తుంటేనే ఒళ్లు తిమ్మిరెక్కుతోంది.....

గాల్లో రెండు కాళ్లు పైకి ఎత్తిన సమంత.. చూస్తుంటేనే ఒళ్లు తిమ్మిరెక్కుతోంది.. ఇవేం విన్యాసాలు రా బాబోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఎలాంటి క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్ లను పట్టేసి బడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందో తెలిసిందే. కాగ ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ కోలీవుడ్లో సైతం మంచి టాప్ పొజిషన్ కి చేరుకుంది. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ది ఫ్యామిలీ మెంబర్ వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ ని ఏలేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత భర్తకు డివర్స్ ఇచ్చేసి సింగల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

అయితే సోషల్ మీడియాలో నానా విధాలుగా ఈమెను ట్రోల్ చేస్తున్నప్పటికీ అలాంటివి ఏమాత్రం పట్టించుకోని సమంత .. రీసెంట్గా తన వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇండోనేషియాలోని బాలిలో ప్రజెంట్ ఈమె ఫుల్ నేచర్ ని ఎంజాయ్ చేస్తుంది . ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన వీడియోస్ ని షేర్ చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో రెండు వీడియోలను షేర్ చేసింది . ఆమె విన్యాసాలు చూసి అందరూ షాక్ అయిపోతున్నారు .

ఆమె మరో అమ్మాయితో కలిసి ఓ ఫీట్ చేసింది.. చూస్తుంటేనే ఒళ్ళు తిమ్మిరెక్కిపోతుంది.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండిగా మారింది . “ఇది చాలా సులభం. “ఇది మా పార్టీ” అనే టైటిల్ పెట్టింది సమంత . మరో అమ్మాయిని కూడా ట్యాగ్ చేసింది. దీనితో జనాలు ఇవేం పార్టీలు రా బాబు.. తేడాలు వస్తే శాల్తీలు లేచిపోతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు సాధారణంగా సమంత కి ఫిట్నెస్ అంటే ఎక్కువ ఇష్టం అని .. అందుకే ఇలాంటి విన్యాసాలు చేస్తుందని చెప్పకు వస్తున్నారు . దీనితో సమంత చేసిన లేటెస్ట్ విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news