Newsస్టార్ హీరో డైరెక్షన్ లో ప్రభాస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..సిల్వర్...

స్టార్ హీరో డైరెక్షన్ లో ప్రభాస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . ఈశ్వర్ సినిమాలో ఎంత అమాయకంగా కనిపించాడో నిన్న కాకమొన్న రిలీజైన ఆదిపురుష్ సినిమాలోను అంతే అమాయకంగా కనిపించాడు . తన దైన స్టైల్ లోసినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్న ఈ హీరో..బాహుబలి సినిమా తర్వాత సాహో -రాధే శ్యామ&- ఆది పురుష్.. సినిమాలు చేసినా కానీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమాలు బోల్తాకొడుతూనే వచ్చాయి .

ఈ క్రమంలోనే నెక్స్ట్ రిలీజ్ అయ్యే ప్రాజెక్టు పై హ్యూజ్ ఆశలు పెట్టుకొని ఉన్నారు ప్రభాస్ . కాగా ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ తన తర్వాతి సినిమాలు ఏ డైరెక్షన్లో చేస్తున్నాడు అనే విషయం ఇంట్రెస్టింగ్గా మారింది . ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ తో ఓ సినిమా కి కమిట్ అయిన ప్రభాస్ ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయి ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇలాంటి క్రమంలోనే మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్ లోను ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ మలయాళీ హీరో యాక్షన్ స్టోరీని రెడీ చేశారట . ఈ హీరో దాన్ని ప్రభాస్ కి చెప్పినట్లు తెలుస్తుంది . అంతేకాదు ప్రభాస్ కూడా ఓకే చెప్పారట . అందుకే పృథ్వీరాజ్ ఎగిరి గంతేసి మరి ఈ సినిమాను చక చక షూటింగ్ కంప్లీట్ చేస్తాను అని ప్రామిస్ చేశారట . ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో డైరెక్షన్లో మరొక స్టార్ హీరో నటించబోతున్నాడు అనే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news