Movies"1 కాదు 2 కాదు ఏకంగా మూడు సార్లు"..ఇన్నాళ్లకి ఆ విషయాని...

“1 కాదు 2 కాదు ఏకంగా మూడు సార్లు”..ఇన్నాళ్లకి ఆ విషయాని బయటపెట్టిన మాధవిలత..!!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్బాస్ ఎలా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందో మనకు బాగా తెలిసిందే. మొదట్లో ఈ షోపై చాలామంది నెగటివ్ స్పందన ఎక్కువగా వినిపించారు. కంటెస్టెంట్లని ఇబ్బంది పెడుతున్నారని .. అది చాలా పాపం అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్ళు స్టార్ గా మారడంతో సామాన్య జనాలకు కూడా బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే ఆరు సీజన్లో కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ త్వరలోనే ఏడో సీజన్ ప్రారంభం కాబోతుంది .

దీంతో అప్పుడే కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చేసింది. హోస్ట్ ఎవరు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగ ఈసారి హోస్టుగా రానా దగ్గుబాటి చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈసారి కంటెస్టెంట్స్ మాత్రం బిగ్ బాస్ చాలా టాప్ సెలబ్రిటీస్ ని తీసుకొస్తుందట . గత సీజన్లో తలా తోకాలేని కంటెస్టెంట్లని తీసుకొచ్చి టిఆర్పి రేటింగ్స్ దారుణంగా పడిపోయేలా చేసుకున్న బిగ్ బాస్.. ఈసారి మాత్రం అందరూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు.. బుల్లితెరపై స్టార్స్ ..యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కించుకున్న స్టార్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారట .

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాధవి లతను సైతం అప్రోచ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మాధవి లత ఫస్ట్ టైం ఈ ఆఫర్ అందుకోవడం లేదట. ఇప్పటికే మూడుసార్లు ఆఫర్ అందుకుందట . అయితే మూడుసార్లు సున్నితంగా ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చింది మాధవి లత . అంతే కాదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అప్రోచ్ అయింది అంటూ క్లారిటీ ఇచ్చింది .

” ఫైనల్ టచ్ చేస్తూ ఇప్పుడు నా ఫేస్బుక్ కుక్కలకు – ముక్కల పండగ ఇప్పుడు మొరగండి ” అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది . దీంతో పలువురు అభిమానులు సీరియస్ అయ్యారు. అంతేకాదు దానిపై క్లారిటీ ఇస్తూ “బిగ్ బాస్ లోకి వెళ్లడం నా పర్సనల్ విషయం.. నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు ..కానీ నన్ను ఆ షోలో పాల్గొనడానికి ఎన్నోసార్లు ప్రయత్నించిన బిగ్ బాస్ టీంకు చాలా థాంక్స్” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు ఎన్నిసార్లు అప్రోచ్ అయ్యినా.. నేను బిగ్ బాస్ లోకి వెళ్ళను అంటూ తెగేసి చెప్పేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news