Newsఓ మై గాడ్: మహేశ్ కు అలాంటి వ్యాధి ఉందా..?...

ఓ మై గాడ్: మహేశ్ కు అలాంటి వ్యాధి ఉందా..? ఎన్ని మందులు వాడినా నయం కాదా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వరుసగా అనారోగ్య బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎంగేజ్ లో ఉండే హీరో హీరోయిన్స్ ఇలా విచిత్రమైన రోగాలకు గురి అవుతూ ఉండడంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . ఇదే క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు సైతం గతంలో ఓ వ్యాధి కారణంగా బాధపడ్డారని చాలా చాలా డిప్రెషన్ కి గురైపోయారని తెలుస్తుంది.

అసలు ఆ వ్యాధి తగ్గుతుందా లేదా అనంత స్థాయికి వెళ్లిపోయారట . ఒక దశలో మహేష్ బాబు విపరీతమైన మైగ్రేన్ తో బాధపడ్డారట తలనొప్పి సమస్య ఎక్కువగా ఏళ్ళు తరబడి వేధిచ్చిందట . ఎన్ని మందులు వాడిన ఎంత మంది వైద్యులను సంప్రదించిన ఫలితం లేకుండా పోయిందట . అసలుకు మైగ్రేన్ కి శాశ్వత పరిష్కారం లేదే లేదని ఫారిన్ డాక్టర్లు సైతం చెప్పేసారట . దీంతో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇన్స్టెంట్గా నొప్పి తగ్గిస్తుందని కానీ సమస్య దూరం చేయలేదు అని ఫిక్స్ అయిపోయాడు మహేష్ బాబు.

ఆ తర్వాత పలు రకాల ట్రీట్మెంట్ ద్వారా హోమియో మందుల ద్వారా .. బాడీ ఫిట్నెస్ ద్వారా ఆ వ్యాధిని నెమ్మదిగా నయం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారట . ఇప్పటికీ అప్పుడప్పుడు మహేష్ బాబు తీవ్ర మైగ్రేన్ సమస్యతో బాధపడుతూనే ఉన్నారట . అంతేకాదు మైగ్రేన్ వల్ల మహేష్ కి మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు మోకాలి సర్జరీ జరిగిందంటూ తెలుస్తుంది . దీంతో ఈ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news