Movies"ప్రభాస్ కి తాతగా ఆ స్టార్ హీరో".. కాంబో తో పిచ్చెక్కిస్తున్న...

“ప్రభాస్ కి తాతగా ఆ స్టార్ హీరో”.. కాంబో తో పిచ్చెక్కిస్తున్న హిట్ డైరెక్టర్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానంలో ఉన్నాడో మనందరికీ బాగా తెలిసిన విషయమే . రీసెంట్గా ఆయన నటించిన ఆది పురుష్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి కొంచెం హిట్.. కొంచెం ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది . కలెక్షన్స్ పరంగా సూపర్ డూపర్ వసూలు రాబట్తిన ఈ సినిమా టాక్ పరంగా మాత్రం అక్కడక్కడ నెగటివ్ రిమార్క్స్ చూపిస్తుంది .

అంతేకాదు అసలు ఇది రామాయణమే కాదని రామాయణాన్ని కించపరిచారు అంటూ డైరెక్టర్ ని బూతులు తిడుతున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ కావడం గమనార్హం. ప్రభాస్ ప్రజెంట్ సల్లార్ – ప్రాజెక్టుకె సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటే చిన్న సినిమా అయిన రాజా డీలక్స్ ని కూడా చేస్తున్నాడు . మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు అన్న వార్తలు వినపడుతున్నా.. ఇదే క్రమంలో ప్రభాస్కు తాతగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ నటించబోతున్నాడు అన్న న్యూస్ సంచలనంగా మారింది. ఇప్పటికే వీళ్ళపై పలు సీన్స్ కూడా చిత్రీకరించారట. అయితే ఈ కాంబో పై జనాలు ఫైర్ అవుతున్నారు . ప్రభాస్కు తాతగా సంజయ్ దత్త నా..? ఏమన్నా కాంబో నా బ్రో ..? చూడ్డానికి ఇద్దరు తండ్రి కొడుకులు లా ఉంటారు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మారుతి సినిమాతో ప్రభాస్కు పెద్ద బొక్క పెట్టేలాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో మరోసారి రాజా డీలక్స్ హాష్ ట్యాగ్ నెట్టింట ట్రేడింగ్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news