Moviesగోపీచంద్ నెక్ట్స్ సినిమా కు పవర్ ఫుల్ టైటిల్ .. హిట్...

గోపీచంద్ నెక్ట్స్ సినిమా కు పవర్ ఫుల్ టైటిల్ .. హిట్ కోసం “వర్షం” సెంటిమెంట్ రిపీట్..కేకపెట్టిస్తున్న కొత్త లుక్..!!

టాలీవుడ్ మ్యాంచో హీరో గా పేరు సంపాదించుకున్న గోపీచంద్ ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ కొట్టడానికి ఎంత తహతహలాడుతున్నారో మనందరికీ బాగా తెలిసిందే. అదేంటో తెలియదు కానీ గోపీచంద్ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సుమని పోతుంది . ఈ క్రమంలోనే ఆయన లాస్ట్ గా నటించిన రామబాణం సినిమా కూడా అట్టర్ ప్లాప్ ను సంపాదించుకుంది . కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతారని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు . అయితే గోపీచంద్ ఆ సినిమాతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు .

ఈ క్రమంలోనే గోపీచంద్ నెక్స్ట్ సినిమా పవర్ ఫుల్ గా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి . తాజాగా ఆ వార్తలు నిజమే అంటూ క్లారిటీ వచ్చేసింది . గోపీచంద్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్ష తో సినిమా చేయబోతున్నాడు అంటూ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే రీసెంట్ ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . కాగా ఇప్పటివరకు మనం గోపీచంద్ ని చాలా సాఫ్ట్ లుక్స్ లోనే చూసాం ..వైల్డ్ గా బోల్డ్ గా చూడడం “వర్షం” సినిమాలో మాత్రమే .

అయితే ఇన్నాళ్లకు ఆ వర్షం సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ గోపీచంద్ హిట్ ట్రాక్ కోసం అంతే గంభీరంగా యాంగ్రీ గా వైల్డ్ గా కనిపించారు . ఈ పోస్టర్స్ ఆధారంగా ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లకు తెరకెక్కిపోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి “భీమా” అనే టైటిల్ ని ఫైనల్ చేశారు డైరెక్టర్. కాగా కన్నడ నాట శివరాజ్ కుమార్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించే హర్ష ఈ సినిమా డైరెక్ట్ చేస్తూ.. ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి .

అంతేకాదు ఈ సినిమాల్లో గోపీచంద్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది . మరి ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ పళ్ళను కొరుకుతూ ..భయంకరమైన కాటులతో.. యాంగ్రీ లుక్స్ తో పెద్ద పెద్ద మీసాలు వేసుకొని చాలా రాష్ లుక్ లో కనిపించారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అందుకుంటుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, జే స్వామి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. గతంలో గోపీచంద్ పంతం సినిమా తెరకెక్కించిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీతో హిట్టు కొట్టాలని చూస్తున్నారు డైరెక్టర్ అండ్ హీరో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news