Movies"బ్రో" టీజర్ వచ్చేసిందోచ్.. ఈ మామ-అల్లుళ్ల మాస్ రచ్చకి బాక్స్ ఆఫిస్...

“బ్రో” టీజర్ వచ్చేసిందోచ్.. ఈ మామ-అల్లుళ్ల మాస్ రచ్చకి బాక్స్ ఆఫిస్ బద్దలే(వీడియో)..!!

టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమాలో ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు . అవుట్ అండ్ అవుట్ మల్టీ స్టారర్ ఎంటర్టైర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సముద్రఖని చాలా ఇష్టంతో దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమాని అయిన సముద్రఖని ఈ స్టోరీని పవన్ కళ్యాణ్ కి వివరించగా స్పాట్లోనే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేశాడు అన్న న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా తమిళ్లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు అధికారిక రీమిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా స్టైలిష్ గా ..ట్రెండీగా.. సాంప్రదాయ బద్దంగా సముద్రఖని డిజైన్ చేసిన తీరు అభిమానులకి తెగ నచ్చేసింది .

మరి ముఖ్యంగా ఈ టీజర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రాసిన డైలాగ్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి అంటూ తెలుస్తుంది . “కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం..” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ చాలా హైలెట్ గా నిలవబోతోంది . అంతేకాదు పవన్ – సాయి ధరంతేజ్ మధ్య వచ్చే సీన్స్ కూడా సినిమాకి సూపర్ గా ప్లస్ ఉన్నాయి అంటూ తెలుస్తుంది . ఓవరాల్ గా చూసుకుంటే జూలై 28 థియేటర్స్ లో రచ్చ రంబోలాగా మారిపోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు సాయి ధరంతేజ్ కూడా చాలా యాక్టివ్ గా స్టైలిష్ గా కనిపించాడు. మరి ముఖ్యంగా ట్రైలర్ లోని మాటలు ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చించేసారని.. ఒక్క ముక్కలో చెప్పేయొచ్చు . ఓవరాల్ గా టీజర్ మొత్తాని చూసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద జూలై 28న సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి రెడీ అయ్యారు ఈ మామ అల్లుళ్ళు అంటూ తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం ఈ టీజర్ ని మీరు చూసేసి ఎంజాయ్ చేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news