Moviesచరణ్ పాపకు శర్వానంద్ అద్దిరిపోయే గిఫ్ట్..మెగా హీరోలకన్నా ఈయనే బెటర్ గా...

చరణ్ పాపకు శర్వానంద్ అద్దిరిపోయే గిఫ్ట్..మెగా హీరోలకన్నా ఈయనే బెటర్ గా ఉన్నాడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా ప్రిన్సెస్ పేరే మారు మ్రోగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పేరు పెట్టకపోయినా సరే మెగా ప్రిన్సెస్ అనే హాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్ . కాగా చరణ్ – ఉపాసన ఎప్పటినుంచో ఎదురుచూసిన బ్యూటిఫుల్ మూమెంట్ రానే వచ్చేసింది . జూన్ 20న 1:49 నిమిషాలకు ఉపాసన పండు లాంటి పాపకి జన్మ నిచ్చింది .

ఆ క్షణం మొదలు ..ఇప్పటివరకు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో మెగా ప్రిన్సెస్ ట్రెండింగ్ లోనే ఉంది. చిరంజీవి సైతం మనవరాలు పుట్టిందన్న ఆనందంలో మా ఇంటి మహారాణి ..మహాలక్ష్మి.. ఇంట్లో జరగబోయే శుభకార్యాలకు ..వస్తున్న పాజిటివ్ వైబ్స్ కు అన్నిటికీ నా మనవరాలు కారణమంటూ మురిసిపోయారు. ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు ..సన్నిహితులు.. స్నేహితులు మెగా మనవరాలికి భారీ వారి గిఫ్ట్స్ అందజేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే చరణ్ కి జాన్ జిగిడి దోస్త్ అయిన హీరో శర్వానంద్ తన కూతురికి భారీ స్థాయిలో గిఫ్ట్స్ పంపించినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. పాప వన్ ఇయర్ వచ్చేవరకు సరిపోయే బట్టలు – బొమ్మలు – బేబీ ప్రోడక్ట్ – ఐటమ్స్..ఇది ఉంది ఇది లేదు అనకుండా.. పాపకి కావాల్సిన అదర్ యాక్ససరీస్ అన్నీ కూడా శర్వానంద్ పాపకు గిఫ్ట్ చేశారట .

అంతేకాదు వీటితోపాటు చరణ్ పాప కోసం ఓ లక్ష్మీదేవి లాకెట్ ని కూడా గిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది . అయితే చాలామంది మెగా హీరోలు ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ కి చిన్న బొమ్మ కూడా గిఫ్ట్ చేయలేదట. వాళ్లతో కంపేర్ చేస్తే శర్వానంద్ వెయ్యి రెట్లు బెటర్ అంటున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news