Moviesహవ్వ..డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో గుబ్బు గబ్బు చేసిన హైపర్‌ ఆది.. ఈ...

హవ్వ..డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో గుబ్బు గబ్బు చేసిన హైపర్‌ ఆది.. ఈ సీజన్ కూడా రచ్చ రంబోలాయేగా..!!

బుల్లితెరపై ఎన్ని షూస్ ఉన్న జబర్దస్త్ కి ఢీ ప్రోగ్రాం కి ఉన్న క్రేజ్ పాపులారిటీ మరి ఏ షోకి రాదని చెప్పాలి. మరి ముఖ్యంగా ఢీ షో ద్వారా ఎంతమంది కొరియోగ్రాఫర్ లు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి తమ లైఫ్ లో సెటిల్ అయిపోయారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఢీ షో 15 సీజన్లు కంప్లీట్ చేసుకుంది . రీసెంట్ గానే 16వ సీజన్ స్టార్ట్ చేస్తూ .. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది .

అయితే ఎప్పటిలా ఢీ16 కాకుండా ఢీ ప్రీమియర్ లీగ్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కాగా ఇందులో చాలామంది జడ్జెస్ మెంటర్స్ మారిపోవడం విశేషం . గత సీజన్లో సందడి చేసిన కమెడియన్ బ్యాచ్ ని మరోసారి దించారు ఢీ నిర్వాహకులు. హైపర్ ఆదిని గత సీజన్లో తొలగించారు . అయితే ఆ ఎఫెక్ట్ బాగా కనపదింది.

ఇప్పుడు ఆయనని మళ్లీ తీసుకొచ్చారు . మనకు తెలిసిందే గత సీజన్ తూ తూ మంత్రంగా నడిచింది షో . ఈ క్రమంలోని హైపర్ ఆది లాంటి ఫన్నీ కమెడియన్ పంచెస్ లేకపోతే షోలో మజా ఉండదని ఆయన తీసుకొచ్చారు. ఢీ నిర్వాహకులు భావించినట్లే తనదైన స్టైల్ లో పంచెస్ .. డబల్ మీనింగ్ డైలాగ్స్ తో రచ్చ చేశాడు హైపర్ ఆది . గ్లామర్ ని వలకబోస్తూ మెంటర్ గా గర్ల్స్ టీంకు దీపిక పిల్లి ఉంటే.. బాయ్స్ టీమ్స్ కు బిగ్ బాస్ విన్నర్ సన్నీ మెంటర్ గా తీసుకొచ్చారు.

అంతేకాదు పూర్ణ ని మళ్ళీ జడ్జిగా తీసుకువచ్చి షోని మరింత ఆకర్షణీయంగా తయారు చేశారు . కాగ రిలీజ్ అయిన ప్రోమో ఆధారంగా వీళ్ళు వేసిన డబల్ మీనింగ్ డైలాగ్స్ అభిమానులకి మళ్లీ ఢీ అంటే అలాంటి ఓ ఫీలింగ్ ని కలగజేసింది . దీంతో ఈ ప్రోమో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news