Moviesమెగా కోడలిగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఉపాసన రియాక్షన్ ఇదే.. తోటి...

మెగా కోడలిగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఉపాసన రియాక్షన్ ఇదే.. తోటి కోడలు పై ఎంత ప్రేమో చూశారా..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఇంటికి సంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. కాగా రీసెంట్గా మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో ఎంగేజ్మెంట్ చేసుకొని మెగా అభిమానులకు షాక్ ఇచ్చారు . వీళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన దీనిపై ఎటువంటి న్యూస్ అప్డేట్ ఇవ్వకపోవడంతో మెగా ఫాన్స్ ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసారు .

అయితే ఎవరు ఊహించని విధంగా లావణ్య వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు షాక్ అయితున్నారు . నాగబాబు నివాసంలో ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల మధ్య వీళ్ల నిశ్చితార్థపు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది . దీంతో నిశ్చితార్థపు వేడుక సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . కాగా ఈ నిశ్చితార్ధపు వేడుకకు అల్లు అర్జున్ -చిరంజీవి -పవన్ కళ్యాణ్ -సాయి ధరంతేజ్- వైష్ణవ తేజ్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే మెగాకోడలు ఉపాసన లావణ్య కు వెల్కమ్ టు కొణిదెల ఫ్యామిలీ అంటూ స్పెషల్ విషెస్ అందించింది ఉపాసన. సోషల్ మీడియా వేదికగా ఉపాసన ..లావణ్య కి కొణిదల ఫ్యామిలీ కు వెల్కం చేసింది. ఈ క్రమంలోనే ఉపాసన ట్విట్టర్ వేదికగా లావణ్య పై ప్రేమ కురిపించింది. ” లావణ్య..నీకు కొణిదల ఫ్యామిలీకి స్వాగతం.. తోడికోడలుగా నీ రాక కోసం నేను ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను .. నువ్వు భార్యగా వస్తున్నందుకు వరుణ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు” అంటూ ఉపాసన పోస్ట్ లో రాసుకోచ్చింది. దీంతో ఉపాసన పోస్టు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news