Newsఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.....

ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు.. నాన్న తగ్గ బిడ్డే..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాలనే కాదు .. వాళ్ళ పిల్లల విషయాలను.. బర్త డే లను కూడా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోని జూన్ 14వ తేదీన గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భార్గవరామ్ ఫొటోస్ ని ట్రెండ్ చేశారు అభిమానులు . ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు – రాజకీయ ప్రముఖులు – ఎన్టీఆర్ కొడుకు భార్గవ రామ్ కు బర్త డే విషెస్ అందించి.. తన బర్తడేను మరింత స్పెషల్ గా మార్చేశారు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం భార్గవరామ్ టాప్ ట్రైనింగ్ లో దూసుకుపోతున్నాడు.

ఇలాంటి క్రమంలోనే భార్గవ రామ్ కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోని తనకి ఫేవరెట్ ఫుడ్ పప్పు అన్నం అంటే చాలా ఇష్టం అని .. అంతేకాదు చాక్లెట్ ఎక్కువగా తింటాడని ..అంతేకాకుండా నేతి అరిసెలు అంటే భార్గవ్ రామ్ కి చాలా చాలా ఇష్టమని .. అది కూడా వాళ్ళ నానమ్మ చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారని.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే భార్గవ్ రామ్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

జనరల్ గా ఏ స్టార్ హీరో కొడుకు అయిన వాళ్ళ నాన్న అంటేనే ఫేవరెట్ హీరోగా ఉంటారు . అయితే భార్గవ్ రామ్ విషయంలో అది పూర్తిగా మారిపోయింది . భార్గవ్ రామ్ కీ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టమట. మరి ముఖ్యంగా పుష్ప సినిమాను ఇప్పటికే ఎన్నోసార్లు చూసి ఎంజాయ్ చేశాడట . అంతేకాదు ఆ సినిమాలో వచ్చే “తగ్గేదేలే” డైలాగ్ ఇప్పటికీ భార్గవ్ రామ్ తనదైన స్టైల్ లో చెప్తూ ఇంట్లో క్యూట్ క్యూట్గా అల్లరి చేస్తూ ఉంటాడు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్ ఫొటోస్ ట్రెండింగ్ మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news