Newsవారెవ్వ: ఇది కదా లవ్ అంటే.. అనుష్క కోసం పాట పాడబోతున్న...

వారెవ్వ: ఇది కదా లవ్ అంటే.. అనుష్క కోసం పాట పాడబోతున్న స్టార్ హీరో.. ఇక యూట్యూబ్ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

చాలా టైం గ్యాప్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క చేస్తున్న మూవీ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ పి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. కాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ పరంగానే లాక్కొచ్చిన డైరెక్టర్ అభిమానులను ఎంటర్టైన్ చేసే విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ . జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తో యువ హీరోగా పేరు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి . ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడు అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో అనుష్క సరికొత్త రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . కాగా ఈ సినిమా కోసం స్టార్ హీరో పాట పాడబోతున్నాడు అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

సంగీత దర్శకుడు రథన్.. త్వరలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేత పాట పాడించి ఆ పాట్ ని రికార్డ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి నుంచి అనుష్క శెట్టి అంటే స్పెషల్ గౌరవం ఉన్న ధనుష్ ఆమె కోసమే ఈ సినిమాలో పాట పాడడానికి ఒప్పుకున్నాడట . అంతేకాదు త్రీ మూవీలో వై దిస్ కొలవరి అంటూ పాడి దేశవ్యాప్తంగా సంచలన రికార్డులు నెలకొల్పి యూట్యూబ్ ని షేక్ చేసిన ధనుష్ …

ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ తిక్క చిత్రంలో కూడా పాట పాడాడు . ఇప్పుడు అనుష్క కోసం తన గొంతును కదపడానికి రెడీ అవుతున్నాడు అంటూ వార్త వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ధనుష్ పాట పాడితే యూట్యూబ్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ న్యూస్ పై ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు . త్వరలోనే ఈ గుడ్ న్యూస్ ని అభిమానులకు అందజేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news