Moviesచైతుపై కోపంతో స‌మంత మ‌ళ్లీ ఏం చేసిందో చూడండి…. ఇంత డీ...

చైతుపై కోపంతో స‌మంత మ‌ళ్లీ ఏం చేసిందో చూడండి…. ఇంత డీ గ్రేడ్ అయిపోవాలా…!

నాగచైతన్యపై సమంత కోపం ఇంకా తగ్గినట్టు లేదు. చైతుతో ప్రేమ పెళ్లి నాలుగేళ్ల పాటు కాపురం చేశాక విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసి కూడా దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. విడాకుల తర్వాత మరింతగా రెచ్చిపోతున్న సమంత వరుసగా సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తోంది. తనకు సినిమా ఛాన్సులు వస్తున్నాయని.. క్రేజ్ విషయంలో చైతు కంటే తానే పై స్థాయిలో ఉన్నానని ప్రూవ్ చేసుకునేందుకు సమంత కింద మీదా పడుతుంది.

అటు పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అంటూ హాట్ ఐటెం సాంగ్‌ల‌తో రెచ్చిపోతుంది. ఇటు సిటాడెల్ లాంటి హాట్ వెబ్ సిరీస్ లకు కూడా ఓకే చెబుతోంది. మరోవైపు యశోద – శాకుంతలం లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. చివరకు తన స్థాయిని దిగజార్చుకుని తనకంటే వయసులో చిన్నోళ్ళు అయిన హీరోలతో కూడా రొమాన్స్ చేసేందుకు ఓకే చెబుతోంది. అసలు సమంత‌ ఎక్కడ ? విజయ్ దేవరకొండ ఎక్కడ ? సమంత ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినప్పుడు విజయ్ దేవరకొండ ఎక్కడ ? ఉన్నాడో కూడా తెలియదు.

అలాంటి విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి సినిమా చేస్తోంది. ఇదే పెద్ద షాక్ అనుకుంటే.. ఇప్పుడు మరో పెద్ద షాక్ ఇచ్చింది. డీజే టిల్లుతో బాగా పాపులర్ అయ్యాడు సిద్దు జొన్నలగడ్డ. ఇప్పుడు యూత్లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు సమంత సిద్దుకు జోడిగా రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు నిర్మాత రామ్ తాళ్లూరి. ఇది కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందటంలో సందేహం లేదు.

పైగా నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. తాజాగా నందిని రెడ్డి అన్ని మంచి శకునములే లాంటి ఫీల్‌గుడ్‌ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సమంతతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే ఆమెతో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు సమంతతో మూడో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా శాకుంతలం సినిమా సమంతకు పెద్ద నిరాశను మిగిల్చింది.

సమంత ఆశలన్నీ త్వరలో రిలీజ్ అయ్యే ఖుషి సినిమా మీద ఉన్నాయి. ఇక ఇప్పుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ సినిమాల్లో నటిస్తున్నాను అంటూ చైతుపై పై చేయి సాధించాన‌ని.. త‌న‌కు కూడా సినిమా ఛాన్సులు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని చెప్పుకుంటూ తృప్తి చెందెందుకే సిద్దు జొన్నలగడ్డ లాంటి హీరోల పక్కన నటించేందుకే సై ఉంటుంది. రేపు ఊరు పేరు లేని హీరోల పక్కన కూడా నటించేందుకు సమంత సై అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news